TDP-Janasena : ఢిల్లీలో చంద్రబాబు-పవన్‌లకు అవమానం.!
భారతీయ జనతాపార్టీ(BJP) పొత్తు కోసం తహతహలాడుతున్న టీడీపీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara chandrababu) ఇంకా ఢిల్లీలోనే బీజేపీ అధినాయకత్వం కరుణాకటాక్ష వీక్షణాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఢిల్లీలో బీజేపీ పెద్దల కోసం జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణతో(Pawan kalyan) కలిసి చంద్రబాబునాయుడు పడిగాపులు కాస్తుండటం టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు.
భారతీయ జనతాపార్టీ(BJP) పొత్తు కోసం తహతహలాడుతున్న టీడీపీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara chandrababu) ఇంకా ఢిల్లీలోనే బీజేపీ అధినాయకత్వం కరుణాకటాక్ష వీక్షణాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఢిల్లీలో బీజేపీ పెద్దల కోసం జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణతో(Pawan kalyan) కలిసి చంద్రబాబునాయుడు పడిగాపులు కాస్తుండటం టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. కార్యకర్తలు కూడా అవమానంగా ఫీలవుతున్నారు. పొద్దునలేస్తే నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం అంటూ చెప్పుకొచ్చే చంద్రబాబు ఇలా పొత్తుల కోసం వెంపర్లాడటం ఏం బాగోలేదని కొందరు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియానేమో బీజేపీనే టీడీపీతో చేతులు కలపడానికి ఉవ్విళూరుతోందని రాస్తున్నాయి. ఢిల్లీలో సీను చూస్తే అలా అనిపించడం లేదు. అసలు బీజేపీ నాయకత్వం చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదని అర్థమవుతోంది. మిగతా రాష్ట్రాలలో పొత్తుల విషయంలో తీరిక లేకుండా ఉన్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఎప్పుడు టైమిస్తారో తెలియదు. ఒకవేళ బీజేపీకి పొత్తు ఇష్టం లేకపోతే ఆ ముక్క డైరెక్ట్‌గా చెప్పేయవచ్చు. అలా కాకుండా ఢిల్లీకి పిలపించుకుని, ఎదురుచూసేట్టు చేయడమంటే ఉద్దేశపూర్వకంగానే తమను అవమానపరుస్తున్నారన్న విషయం చంద్రబాబు, పవన్‌లకు అర్థం కానట్టుగా ఉంది. నిన్న ఉదయం నుంచి టీడీపీ అనుకూల మీడియా సంస్థలు ఒకటే హడావుడి చేశాయి. అక్కడికేదో టీడీపీలోని ఎన్డీయే చేరుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చాయి. ఈ వయసులో చంద్రబాబు ఇలా అవమానాలపాలవ్వడాన్ని టీడీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయి.