పార్లమెంట్ ఎన్నికలపై(Pariament Elections) బీజేపీ(BJP) ఫోకస్ పెట్టింది. ఫిబ్రవరి చివరివారంలో లేదా మార్చి మొదటి వారంలో లోక్ సభ ఎన్నికలకు(Lok Sabha Elections) వెళ్లేందుకు బీజేపీ హైకమాండ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ఆత్మవిశ్వాసంతో లోక్‎సభ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మూడు రాష్ట్రాల సీఎంలను ఆచితూచి ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మధప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మోహన్‌యాదవ్‌(Mohan Yadav) ఎంపిక వెనుక బీజేపీ పెద్ద స్కెచ్‌​ వేసిందని తెలుస్తోంది.

మరో కొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ..ముచ్చటగా మూడోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాట్రిక్ కొట్టాలని యోచిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే యాదవ్‌(Yadav) వర్గానికి చెందిన నేతను మధ్యప్రదేశ్(Madhya Pradesh) సీఎం పదవికి ఎంపిక చేశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌‎లో యాదవ జనాభా అత్యధికంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించాలంటే పెద్ద రాష్ట్రమైన యూపీతో(UP) పాటు బీహార్‌లో(Bihar) వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు సాధించాల్సి ఉంటుంది. ఈ రెండు రాష్ట్రాలలో యాదవ జనాభా ఎన్నికల్లో డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌గా ఉంది. దీన్ని టార్టెట్‎గా పెట్టుకునే యాదవ సామాజిక వర్గానికి చెందిన మోహన్‌ యాదవ్‌ పేరును తెరపైకి తెచ్చి.. మధ్యప్రదేశ్‌ సీఎంగా బీజేపీ ఎంపిక చేసిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ నూత‌న సీఎంగా ఎంపికైన మోహన్ యాదవ్..ప్రస్తుతం ఉజ్జ‌యిని సౌత్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మోహ‌న్ యాద‌వ్ ఉజ్జ‌యిని ద‌క్షిణ్ నుంచి 2013లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న మ‌రోసారి ఉజ్జ‌యిని ద‌క్షిణ్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2020 జులైలో ఆయ‌న శివరాజ్ చౌహాన్ కేబినెట్‌లో చేరి.. మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. అయితే మధ్యప్రదేశ్ సీఎం రేసులో ఎంతో మంది ఉన్నా..బీజేపీ అధిష్టానం మాత్రం అనూహ్యంగా మోహన్ యాదవ్ పేరును తెరపైకి తీసుకువచ్చింది.

మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌ యాదవ్‌ ఎంపిక యూపీ ఎన్నికలపై కూడా ప్రభావం చూపనుంది.
సీఎం మోహన్ యాదవ్ సతీమణి యూపీకి చెందిన వారు కావడంతో అక్కడ కూడా ఆయన ప్రభావం కచ్చితంగా ఉంటుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. మోహన్‌​ యాదవ్‌ మామయ్య యూపీలోని సుల్తాన్‌పూర్‌ నివాసి. యూపీ, బీహార్‌ రాష్ట్రాల్లో మొత్తం 120 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. వీటిలో వీలైనన్ని ఎక్కువ సీట్లు తమ ఖాతాలో వేసుకుని ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలనేది కమలనాథుల టార్గెట్‌.

మోహన్‌ యాదవ్‌ ఎంపికతో యాదవ్‌ ఓట్ల మీద ఆధారపడి రాజకీయం చేసే యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, బీహార్‌లో ఆర్జేడీని లోక్‌సభ ఎన్నికల్లో దెబ్బకొట్టేందుకు బీజేపీ పెద్ద స్కెచ్‌​ వేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇప్పటికే 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)ని ఓడించి బీజేపీ రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.

Updated On 12 Dec 2023 2:09 AM GMT
Ehatv

Ehatv

Next Story