కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది.. ఈసీ ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలకు మే 10న ఎన్నికలు జరగనున్నాయి (Karnataka Assembly Elections 2023).. అయితే ఇప్పుడు కర్ణాటక రాజకీయమంతా తెలుగువారిపై పడింది.. కర్ణాటకలోని దాదాపు 30 నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు, వారే అక్కడ డిసైడింగ్ ఫాక్టర్ గా మారారు... వారి ఓట్లను పొందేందుకు ప్రతి పార్టీ ఎంతగానో కృషి చేస్తుంది...

కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది.. ఈసీ ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలకు మే 10న ఎన్నికలు జరగనున్నాయి (Karnataka Assembly Elections 2023).. అయితే ఇప్పుడు కర్ణాటక రాజకీయమంతా తెలుగువారిపై పడింది.. కర్ణాటకలోని దాదాపు 30 నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు, వారే అక్కడ డిసైడింగ్ ఫాక్టర్ గా మారారు... వారి ఓట్లను పొందేందుకు ప్రతి పార్టీ ఎంతగానో కృషి చేస్తుంది... అయితే బీజేపీ ఇప్పుడు తెలుగు ఓటర్లను టార్గెట్ చేసింది... ఆ ఓట్లను ఎలాగైనా సాధించాలని కొత్త వ్యూహాలు రచిస్తోంది. అందుకోసం తెలుగు టాప్ సెలెబ్రిటీలను రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తుంది. జూ.ఎన్టీఆర్ (jr.NTR), ప్రభాస్(Prabhas), రామ్ చరణ్(Ram Charan), చిరంజీవి (Chiranjeevi) వంటి టాప్ స్టార్స్‏ని ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది.. ఇప్పటికే బీజేపీ పెద్దలు తెలుగు స్టార్స్‏పై అమితమైన ప్రేమ చూపిస్తున్నారు, RRR సినిమా నుంచి ఆస్కార్ వరకు అన్నిటిలోను తెలుగు హీరోలను పొగుడుతూ వాళ్ళని సత్కరిస్తూ వస్తుంది. జూ.ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్ కావడంతో వారు ప్రచారం చేస్తే బీజేపీకి అది ప్రయోజనంగా మారుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో మన స్టార్స్ ప్రచారం చేస్తారా అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది.

Updated On 12 April 2023 3:54 AM GMT
Ehatv

Ehatv

Next Story