బీజేపీ (BJP) అధిష్టానం కీలకం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ (RAJA SING)పై సస్పెన్షన్(Suspension) ఎత్తివేస్తూ బీజేపీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. అనుచిత వ్యాఖ్యలు చేశాడని గత ఏడాది ఆగస్ట్‌లో రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసిన బీజేపీ, ఎన్నికల వేళ రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
బీజేపీ (BJP) అధిష్టానం కీలకం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ (RAJA SING)పై సస్పెన్షన్(Suspension) ఎత్తివేస్తూ బీజేపీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. అనుచిత వ్యాఖ్యలు చేశాడని గత ఏడాది ఆగస్ట్‌లో రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసిన బీజేపీ, ఎన్నికల వేళ రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల(Elections) సమయంలో సస్పెన్షన్ ఎత్తివేత నిర్ణయంతో గోషామహల్ నుంచి పోటీకి రాజాసింగ్‌కు మార్గం సుగుమమైంది.
ఇప్పటికే గోషామహల్(Goshamahal) నుంచే పోటీ చేస్తానని రాజాసింగ్ ప్రకటించారు. పార్టీ మారుతారని గతంలో రాజాసింగ్‌పై వార్తలు వచ్చినప్పటికీ, ఆ వార్తలను రాజాసింగ్ ఖండించారు. తనపై బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేయకుంటే ఇంట్లో కూర్చుంటా కానీ, మరో పార్టీకి వెళ్లి పోటీ చేయబోనని రాజాసింగ్ ప్రకటించారు. ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ సెక్యులర్ పార్టీల్లో చేరే ప్రసక్తే లేదని రాజాసింగ్ సస్పష్టం చేశారు. రాజాసింగ్‌పై సస్సెండ్ చేయాలని బీజేపీ అధిష్టానాన్ని విజయశాంతి(Vijayashanti) సహా పలువురు నేతలు కోరారు. ఇటు బీజేపీ కార్యకర్తలు కూడా రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీజేపీ ఒత్తిడి తీసుకువచ్చారు.
గోషామహల్ నుంచి టికెట్ ఆశించినవారిలో ముఖేష్‌గౌడ్(Mukesh Goud) కుమారుడు విక్రమ్‌గౌడ్(Vikram Goud) ఉన్నారు. రాజాసింగ్ సస్పెన్షన్ తర్వాత గోషామహల్ నియోజకవర్గంలో విక్రమ్‌గౌడ్ పలు పార్టీ కార్యక్రమాలు చేపట్టాడు. గత ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాజాసింగ్ ఉన్నారు. అధిష్టానంపై కార్యకర్తల తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో చివరగా రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది