ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్(Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు(Assembly elections) అభ్యర్థుల(Candidates) తొలి జాబితాను బీజేపీ ఈరోజు ప్రకటించింది. భారత ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించకముందే.. బీజేపీ(BJP) అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ఇదే తొలిసారి.
ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్(Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు(Assembly elections) అభ్యర్థుల(Candidates) తొలి జాబితాను బీజేపీ ఈరోజు ప్రకటించింది. భారత ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించకముందే.. బీజేపీ(BJP) అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ఇదే తొలిసారి. 90 మంది సభ్యులున్న ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) అసెంబ్లీకి తొలి జాబితాలో 21 మంది అభ్యర్థులను, 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి 39 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను పార్టీ ప్రకటించింది.
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం బుధవారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah), జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు బీజేపీ నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశం అర్థరాత్రి వరకు కొనసాగింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల సన్నాహాలను సమావేశంలో సమీక్షించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సన్నద్ధతపై కూడా సీఈసీ సభ్యులు సమీక్షించారు.
అభ్యర్థుల పేర్లను ముందుగానే ప్రకటించాలని బీజేపీ నాయకత్వం తీసుకున్న నిర్ణయం శ్రేణుల్లో విభేదాలను గుర్తించి.. సమస్యలను ముందుగానే పరిష్కరించే లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఈ ఏడాది ప్రారంభంలో కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత.. బీజేపీ మరో రాష్ట్రంలో ఓటమి చెందకూడదనే గట్టి నిర్ణయానికి వచ్చింది. రాజస్థాన్, తెలంగాణ, మిజోరాంతో పాటు ఈ ఏడాది చివర్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలుగా ఉండగా.. అనూహ్యంగా మధ్యప్రదేశ్ బీజేపీ చేతుల్లోకి వెళ్లింది. తెలంగాణను బీఆర్ఎస్ ఏలుతుంది.