వెక్కి వెక్కి ఏడ్చిన బీజేపీ నేత

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ టిక్కెట్ నిరాకరించినందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ ఎమ్మెల్యే ఒక ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్నారు. రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో శశి రంజన్ పర్మార్ పేరు కనిపించకపోవడంతో ఆయన తెగ ఫీల్ అయ్యారు. పర్మార్.. భివానీ లేదా తోషమ్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నారు.. కానీ అతడికి నిరాశ ఎదురైంది. "జాబితాలో నా పేరు వస్తుందని అనుకున్నాను.." కానీ రాలేదు అంటూ ఏడుపు ప్రారంభించారు. ఇంటర్వ్యూయర్ లీడర్‌ను ఓదార్చడానికి ప్రయత్నించినా కూడా.. మాజీ ఎమ్మెల్యే మాత్రం ఏడుస్తూనే కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"నా పేరు పరిశీలనలో ఉందని నేను ప్రజలతో చెప్పుకున్నాను, నేను ఇప్పుడు ఏమి చేయాలి? నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను," అని ఎమ్మెల్యే రోదిస్తూ చెప్పుకొచ్చారు. హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 12, పత్రాల పరిశీలన సెప్టెంబర్ 13న జరుగుతుంది. సెప్టెంబర్ 16 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.


Sreedhar Rao

Sreedhar Rao

Next Story