ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాజధాని లక్నోలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఓ వ్యక్తి మరణించారు. చనిపోయిన వ్యక్తి బీజేపీ(BJP) మాజీ ఎంపీ కుమారుడు కావడం గమనార్హం. ఆసుపత్రిలో సరిపడినన్ని పడకలు లేకపోవడం, సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో ఈ దారుణం జరిగింది.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాజధాని లక్నోలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఓ వ్యక్తి మరణించారు. చనిపోయిన వ్యక్తి బీజేపీ(BJP) మాజీ ఎంపీ కుమారుడు కావడం గమనార్హం. ఆసుపత్రిలో సరిపడినన్ని పడకలు లేకపోవడం, సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో ఈ దారుణం జరిగింది. బీజేపీ మాజీ ఎంపీ భైరోన్ ప్రసాద్ మిశ్రా(Bhairon Prasad Mishra) కుమారుడు ప్రకాశ్ మిశ్రా(Prakash Mishra) మూత్రపిండాల వ్యాధితో(Lungs Disease) బాధపడుతున్నారు.
సోమవారం రాత్రి 41 ఏళ్ల ప్రసాద్ మిశ్రా ఆరోగ్యం బాగా క్షీణించింది. దాంతో 11 గంటలకు లక్నోలోని ఎస్‌పీజీఐ హాస్పిటల్(SPGI Hospital) ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. చికిత్స పొందుతూ ప్రకాశ్ మిశ్రా చనిపోయారు. కుమారుడి మరణంతో తీవ్రంగా కుంగిపోయారు భైరోన్ ప్రసాద్. ఆసుపత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎమర్జెన్సీ వార్డులో(Emergency Ward) సరిపడ బెడ్స్ లేకపోవడం వల్లే తన కుమారుడు మరణించాడని ఆరోపించారు. అత్యవసర వైద్యాధికారి కూడా రోగిని కాపాడేందుకు ప్రయత్నించలేదని, అసలు ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. గమ్మున అలా ఉండిపోవడం వల్లే తన కుమారుడు చనిపోయాడని మాజీ ఎంపీ అన్నారు.
కొడుకు మృతదేహంతో ఆసుప్రతి ఎమర్జెన్సీవార్డు వెలువల భైరోన్ ప్రసాద్ మిశ్రా ఆందోళన చేపట్టారు. తన కొడుకు చావుకు కారణమైన డాక్టర్‌ను సస్పెండ్ చేసి తదుపరి విచారణ చేపట్టేవరకు తన నిరసన కొనసాగుతుందని అన్నారు.
దీనిపై స్పందింంచిన ఆసుపత్రి యాజమాన్యం విచారణకు త్రిసభ్య కమిటీని నియమించింది. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం డాక్టర్‌ను సస్పెండ్ చేశామని ఆసుపత్రి చీఫ్ ఆరేకే ధీమాన్ పేర్కొన్నారు. భైరోన్ ప్రసాద్ మిశ్రా గతంలో బండా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు.
అయితే ఈ సంఘటన రాజకీయ దుమారం రేగింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు.
ఇది ఆసుపత్రి వైఫల్యం కాదని, యోగి ఆదిత్యనాథ్ వైఫల్యమని మండిపడ్డారు.. ఆసుపత్రులకు బడ్జెట్ ఎందుకు కేటాయించడం లేదని ఆయన ప్రశ్నించారు.