జమిలీ ఎన్నికలకు బీజం పడబోతున్నదా? లోక్‌సభ ఎన్నికలతో(Lok Sabha Elections) పాటే తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) జరగనున్నాయా? వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ తర్వాత తెలుగు రాష్ట్రాలు ఎన్నికల పండుగను నిర్వహించుకోనున్నాయా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి బీజేపీ(BJP) వర్గాలు. కేసీఆర్‌(KCR), జగన్‌లకు(Jagan) ఏకకాలంలో ఎన్నికలు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయని ఢిల్లీలోని కమలదళ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి లోక్‌సభ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ మాసంలో జరగాలి.

జమిలీ ఎన్నికలకు బీజం పడబోతున్నదా? లోక్‌సభ ఎన్నికలతో(Lok Sabha Elections) పాటే తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) జరగనున్నాయా? వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ తర్వాత తెలుగు రాష్ట్రాలు ఎన్నికల పండుగను నిర్వహించుకోనున్నాయా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి బీజేపీ(BJP) వర్గాలు. కేసీఆర్‌(KCR), జగన్‌లకు(Jagan) ఏకకాలంలో ఎన్నికలు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయని ఢిల్లీలోని కమలదళ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి లోక్‌సభ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ మాసంలో జరగాలి.

కానీ మూడు నెలల ముందుగానే సార్వత్రిక ఎన్నికలు జరపాలని నరేంద్రమోదీ(Narendra Modi) సర్కార్‌ అనుకుంటున్నదట! జనవరిలో జరిగే లోక్‌సభ ఎన్నికలతో పాటే 13 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కలిపి మినీ జమిలి ఎన్నికలు(Mini Jamili Elections) నిర్వహించే అవకాశం ఉందని బీజేపీ కేంద్ర నాయకత్వం అంటోంది. ఈ విషయాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా చెప్పినట్టు సమాచారం. తెలంగాణ విషయానికి వస్తే పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను(Bandi Sanjay) తొలగించి పెద్ద పొరపాటు చేశామని బీజేపీ పెద్దలకు అర్థమయ్యింది.

బండి సంజయ్‌ స్థానంలో కిషన్‌ రెడ్డిని(Kishan Reddy) నియమించిన తర్వాత బీజేపీ గ్రాఫ్‌ క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. తత్వం బోధపడటంతో బీజేపీ భవిష్యత్‌లో సహకారం కోసం అధికార బీఆర్‌ఎస్‌తో(BRS) రహస్య ఒప్పందం కుదుర్చుకున్నదని కొందరు అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు. బీఆర్‌ఎస్‌తో కుదుర్చుకున్న బంధంతో కాంగ్రెస్‌ను(Congress) అడ్డుకోవచ్చన్నది బీజేపీఆలోచన! కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అన్నది ఆ పార్టీ నినాదం అన్నది మర్చిపోవద్దు. ఇక తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, చత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నెల, రెండు నెలలు వాయిదా వేసి, ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కాసింత ముందుకు జరిపి వాటితోపాటే లోక్‌సభ ఎన్నికలను నిర్వహించాలన్నది మోదీ ఆలోచన.

అయితే అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్‌ కంటే ముందుకు జరపడం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి(Jagan Mohan Reddy) ఇష్టం లేదట! బీజేపీ అధినాయకత్వం ప్రతిపాదనకు ఆయన విముఖంగా ఉన్నారట! రాజకీయాలలో అవినీతికి తావు లేకుండా చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అవినీతి ముద్ర పడిన వారిని కూడా నిర్మోహమాటంగా పార్టీలో చేర్చుకుంటోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం విషయమే తీసుకుంటే కేంద్ర సంస్థలు ఈ కేసును విచారిస్తున్నాయి. కేసీఆర్‌(KCR) కూతురు కవిత(Kavitha) కూడా దర్యాప్తును ఎదుర్కొంటున్నారన్న విషయం తెలిసిందే.

ఆ మధ్యన కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు ప్రదర్శించాయి. ఓ దశలో కవిత అరెస్ట్‌ అవ్వడం ఖాయమనే వార్తలు కూడా వచ్చాయి. ఏమైందో ఏమోకానీ లిక్కర్‌ స్కామ్‌లో కేంద్ర ఏజెన్సీల దర్యాప్తులో వేగం తగ్గింది. మందగించిందని చెప్పుకోవచ్చు. ఇది బీజేపీ విశ్వసనీయతపై అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ముందస్తు ఎన్నికలపై కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇటీవల బీజేపీ పెద్దలతో సమావేశమైన తర్వాతే చంద్రబాబు ముందస్తు గురించి తన పార్టీ నేతలతో చర్చించారు.

ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలంటూ క్యాడర్‌కు సూచిస్తున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం ముందస్తుకు విముఖంగా ఉన్నారు. ఇలాంటి వార్తలను వెంటనే ఖండించాలంటూ సహచర నేతలకు సూచించారు. టీడీపీ అనుకూల మీడియానే ముందస్తును ప్రచారం చేస్తున్నది కానీ ఇందులో నిజం లేదని జగన్‌ అంటున్నారట! కానీ మోదీ నిర్ణయం తీసుకుంటే మాత్రం దానిని జగన్ వ్యతిరేకించలేరని బీజేపీ నేతలు అంటున్నారు. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated On 7 Sep 2023 1:51 AM GMT
Ehatv

Ehatv

Next Story