జనవరి 22న అయోధ్యలోని రామ మందిరానికి సంబంధించిన ‘ప్రాణ్‌ ప్రతిష్ట’ను "నాచ్‌గాన " కార్యక్రమంగా మారిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించి పెద్ద రాజకీయ దుమారం రేపారు.

జనవరి 22న అయోధ్యలోని రామ మందిరానికి సంబంధించిన ‘ప్రాణ్‌ ప్రతిష్ట’ను "నాచ్‌గాన(Nachgana)" కార్యక్రమంగా మారిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వ్యాఖ్యానించి పెద్ద రాజకీయ దుమారం రేపారు. రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠ(Ram Mandir Pran Pratishtha)ను అణగారిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించకుండా సెలబ్రిటీ ఈవెంట్‌గా మార్చారని రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని విమర్శించారు. అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), అదానీ(Adani), అంబానీ(Ambani), ఇతర ప్రముఖులను ఆహ్వానించారు కానీ అక్కడ ఒక్క రైతు ఉన్నాడా.. కూలీ ఉన్నాడా అని ప్రశ్నించారు. అక్కడ కేవలం డ్యాన్స్ మాత్రమే కనిపించిందని రాహుల్‌ మాట్లాడిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. రాహుల్‌ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. హిందూ ఆచార వ్యవహారాలపై రాహుల్‌కు విశ్వాసం, నమ్మకం ఎంత ఉందో ఆయన మాటలను బట్టే అర్థమవుతుందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేత తిరత్ సింగ్ రావత్(BJP Teerat Singh Rawat) మాట్లాడుతూ, “బహుశా రాహుల్ గాంధీ.. భారతీయ సంస్కృతిని ఇంకా అర్థం చేసుకోలేకపోవచ్చు. భారతీయ సంస్కృతిని అర్థం చేసుకోగలిగినప్పుడే ఆయన ఈ ఆచారాలు అర్థమవుతాయని తెలిపారు. ప్రాణప్రతిష్ఠ వేడుకలో సామాన్య ప్రజలు కూడా పాల్గొన్నారన్నారు. రాహుల్ గాంధీ, అతని కుటుంబం హిందూ వ్యతిరేకమని మరోసారి రుజువైందని తిరత్‌సింగ్‌ విమర్శించారు.

ehatv

ehatv

Next Story