అమరావతి సిట్టింగ్ ఎంపీ నవనీత్ రాణా బుధవారం అర్థరాత్రి నాగ్‌పూర్‌లో ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే సమక్షంలో బీజేపీలో చేరారు.

అమరావతి సిట్టింగ్ ఎంపీ నవనీత్ రాణా బుధవారం అర్థరాత్రి నాగ్‌పూర్‌లో ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే సమక్షంలో బీజేపీలో చేరారు. నాగ్‌పూర్‌లోని బవాన్‌కులే నివాసంలో ఆమె తన మద్దతుదారులతో పాటు అమరావతి, నాగ్‌పూర్, వార్ధా తదితర ప్రాంతాలకు చెందిన పార్టీ సీనియర్ నేతల సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన సమయంలో ఆమె ఎమ్మెల్యే భర్త రవి రాణా కూడా అక్కడే ఉన్నారు.

అమరావతి స్థానానికి పార్టీ అభ్యర్థిగా ఆమె పేరును బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది. ఏప్రిల్ 4న ఆమె ఎన్నికల నామినేషన్ దాఖలు చేయనున్నట్లు బవాన్‌కులే తెలిపారు. బవాన్‌కులే నివాసంలో అర్ధరాత్రి విలేకరుల సమావేశంలో నవనీత్ రాణా మాట్లాడుతూ.. తాను గత ఐదేళ్లుగా ఎన్‌డిఎ మద్దతుదారుగా ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల అభివృద్ధి పథాన్ని అనుసరిస్తున్నారని అన్నారు.

బీజేపీలో చేరడంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ.. సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే 400 సీట్లలో అమరావతి పార్లమెంటరీ నియోజకవర్గం ఒకటిగా ఉండేలా చూస్తానని చెప్పారు. విక‌సిత్ భారత్‌ అనే ప్రధాని మోదీ దార్శనికతకు మద్దతు ఇచ్చేందుకే నవనీత్ రాణా బీజేపీలో చేరారని బవాన్‌కులే చెప్పారు. రానా తొలిసారిగా 2014లో అమరావతి నుంచి ఎన్సీపీ టికెట్‌పై పోటీ చేసి శివసేన అభ్యర్థి ఆనందరావు అద్సుల్ చేతిలో ఓడిపోయారు. 2019లో ఎన్సీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అద్సుల్‌పై విజయం సాధించారు.

Updated On 27 March 2024 10:57 PM GMT
Yagnik

Yagnik

Next Story