బీజేపీ మంగళవారం రాత్రి అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ(Bharatiya Janata Party) తొలి అభ్యర్థుల జాబితాలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Bommai), ప్రముఖ నేత బీఎస్‌ యడియూరప్ప(BS Yediyurappa) కుమారుడు బీవై విజయేంద్ర(BY Vijayendra), జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి(CT Ravi) వంటి పలువురు ప్రముఖులు ఉన్నారు. ఈ జాబితాలో మొత్తం ఎనిమిది మంది మహిళలు చోటు దక్కించుకున్నారు. మొదటి జాబితాలో ఐదుగురు న్యాయవాదులు, తొమ్మిది మంది వైద్యులు, […]

బీజేపీ మంగళవారం రాత్రి అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ(Bharatiya Janata Party) తొలి అభ్యర్థుల జాబితాలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Bommai), ప్రముఖ నేత బీఎస్‌ యడియూరప్ప(BS Yediyurappa) కుమారుడు బీవై విజయేంద్ర(BY Vijayendra), జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి(CT Ravi) వంటి పలువురు ప్రముఖులు ఉన్నారు. ఈ జాబితాలో మొత్తం ఎనిమిది మంది మహిళలు చోటు దక్కించుకున్నారు. మొదటి జాబితాలో ఐదుగురు న్యాయవాదులు, తొమ్మిది మంది వైద్యులు, ముగ్గురు విద్యావేత్తలు, ఒక రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి, ఒక రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి పేర్లు ఉన్నాయి. అలాగే.. ముగ్గురు ఉద్యోగులు, ప్రభుత్వ సర్వీసు నుంచి పదవీ విరమణ పొందిన ఎనిమిది మంది సామాజిక కార్యకర్తలకు కూడా చోటు కల్పించారు. 189 మంది అభ్యర్థుల జాబితాలో 52 మంది కొత్త ముఖాల పేర్లు ఉన్నాయి.

ఢిల్లీలో అభ్యర్థుల తొలి జాబితాను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌(Dharmendra Pradhan), కర్ణాటక ఇంచార్జి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌(Arun Singh) విడుదల చేశారు. బీజేపీ రెండో జాబితాను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. కర్ణాటక శాసనసభలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. అందులో 119 మంది ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాంగ్రెస్‌కు 75 మంది, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Basavaraj Bommai) షిగ్గావ్ నుంచి పోటీ చేయనున్నారు. మంత్రులు సుధాకర్ కె, సిఎన్ అశ్వత్ నారాయణ్ చిక్కబళ్లాపూర్, మల్లేశ్వరం స్థానాల నుండి పోటీ చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప 1983 నుంచి ఏడుసార్లు గెలుపొందిన షికారిపుర స్థానం నుంచి ఆయ‌న‌ కుమారుడు బీవై విజయేంద్ర పోటీ చేయనున్నారు. వరుణలో ఈసారి కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా సోమన్న పోటీ చేయనున్నారు. రెండో స్థానమైన చామరాజనగర్ నుంచి కూడా సోమన్న పోటీ చేయనున్నారు.

బొమ్మై కేబినెట్‌లోని దేవాదాయ శాఖ మంత్రి ఆర్ అశోక్ కనకపుర నియోజకవర్గం నుంచి.. కాంగ్రెస్ క‌ర్ణాట‌క అధ్య‌క్షుడు డీకే శివకుమార్‌తో తలపడనున్నారు. కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర.. తీర్థహళ్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కర్ణాటక శాసన మండలి సభ్యుడు సీపీ యోగేశ్వర్ చన్నపట్న నుంచి జనతాదళ్ (సెక్యులర్) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి(HD Kumaraswamy)కి సవాలు విసర‌నున్నారు.

బెంగళూరు మాజీ కమిషనర్‌ భాస్కర్‌రావు చామరాజ్‌పేట నుంచి పోటీ చేయనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కన్నడ నటుడు, రాజకీయవేత్త బీసీ పాటిల్(BC Patil) ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న హిరేకెరూరు నుండి పోటీ చేయనున్నారు. బళ్లారి రూరల్ నుంచి శ్రీరాములు పోటీ చేయనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి నాలుగుసార్లు గెలిచిన చిక్‌మగళూరు నుంచి పోటీ చేయనున్నారు.

మంత్రి ఆనంద్ సింగ్ కుమారుడు సిద్ధార్థ్ సింగ్.. కమ్లీ నుంచి పోటీ చేయనున్నారు. రమేష్ జార్కిహోళి, గోవింద్ ఎం కార్జోల్.. గోకాక్, ముధోల్ నుండి పోటీ చేయనున్నారు.

బీజేపీ ఈసారి 52 మంది కొత్త ముఖాలను రంగంలోకి దించింది. 189 మంది అభ్యర్థుల జాబితాలో, 32 మంది ఇతర వెనుకబడిన తరగతుల (OBC) నుండి కాగా.. 30 మంది షెడ్యూల్డ్ కులాల నుండి, 16 మంది షెడ్యూల్డ్ తెగల నుండి ఉన్నారు.

కర్ణాటకలో బీజేపీ అఖండ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ నేత అరుణ్ సింగ్ ప్రకటించారు. కాంగ్రెస్ నేలపై లేదని, ఫ్యాక్షనిజంతో ఇబ్బంది పడుతోందని విమ‌ర్శించారు. జనతాదళ్ (సెక్యులర్) మునిగిపోతున్న నావ అని ఆయన అన్నారు.

కర్ణాటక బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప టిక్కెట్లు ప్రకటించడానికి కొన్ని గంటల ముందు.. తాను రాజకీయాల నుండి విరమించుకోవాలని అనుకుంటున్నానని.. ఎన్నికల్లో పోటీ చేయనని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నేత జగదీశ్‌ షెట్టర్‌కు బీజేపీ టిక్కెట్టు నిరాకరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని పార్టీ తనను కోరిందని, దీనిపై తన అభిప్రాయాన్ని పార్టీ అగ్రనేతలకు తెలియజేశానని శెట్టర్ తెలిపారు. శెట్టర్ అసంతృప్తిపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ఆయన మా పెద్ద నాయకుడని, ఆయనకు అర్థమయ్యేలా చెబుతామని అన్నారు. ఇంకా 34 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సి ఉంది.

Updated On 12 April 2023 3:55 AM GMT
Yagnik

Yagnik

Next Story