మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(Madhya Pradesh Assembly Elections) తేదీలను ఎన్నికల సంఘం(Elections Commission) ప్రకటించింది. కాగా, మధ్యప్రదేశ్‌లో వచ్చే ఎన్నికలకు 57 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ(BJP) విడుదల చేసింది. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థుల(Candidates) నాలుగో జాబితాను సోమవారం విడుదల చేసింది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(Madhya Pradesh Assembly Elections) తేదీలను ఎన్నికల సంఘం(Election Commission) ప్రకటించింది. కాగా, మధ్యప్రదేశ్‌లో వచ్చే ఎన్నికలకు 57 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ(BJP) విడుదల చేసింది. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థుల(Candidates) నాలుగో జాబితాను సోమవారం విడుదల చేసింది. ఈసారి మరో 57 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధ్ని(Shivraj Singh Chauhan Budhni) నుంచి బరిలో ఉండగా.. రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా(Narottam Mishra).. దతియా నుంచి పోటీ చేయనున్నారు. కీలక నాయకులైన గోపాల్ భార్గవ.. రెహ్లీ నుంచి, విశ్వాస్ సారంగ్.. నరేలా నుంచి, తులసీరామ్ సిలావత్.. సేవర్ నుంచి పోటీ చేయనున్నారు.
ఇదిలావుంటే.. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాథ్(Kamal Nath) రాష్ట్రంలో పార్టీ విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసే వారికి ఓటర్లు గుణపాఠం చెబుతారని అన్నారు. కొన్నేళ్లుగా మధ్యప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్న తేదీని ఈరోజు అధికారికంగా ప్రకటించారని చెప్పారు. నవంబర్ 17న మధ్యప్రదేశ్‌లో పోలింగ్ జరగనుందని పేర్కొన్నారు.