Lawrence Bishnoi gang : ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ హస్తం?
కెనడాలో(Canada) బుధవారం రాత్రి జరిగిన గ్యాంగ్‌వార్‌లో(Gang war) మరో ఖలిస్థాన్ ఉగ్రవాది సుఖ్‌దూల్ సింగ్(Sukhdul Singh) అలియాస్ సుఖ దునెకె చనిపోయిన సంగతి తెలిసిందే! అయితే ఈ హత్యకు పూర్తి బాధ్యత తమదేనని లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) గ్యాంగ్ ప్రకటించింది.
కెనడాలో(Canada) బుధవారం రాత్రి జరిగిన గ్యాంగ్‌వార్‌లో(Gang war) మరో ఖలిస్థాన్ ఉగ్రవాది సుఖ్‌దూల్ సింగ్(Sukhdul Singh) అలియాస్ సుఖ దునెకె చనిపోయిన సంగతి తెలిసిందే! అయితే ఈ హత్యకు పూర్తి బాధ్యత తమదేనని లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) గ్యాంగ్ ప్రకటించింది. గ్యాంగ్‌స్టర్‌లు గుర్‌లాల్ బ్రార్, విక్కీ ముద్దుకేరా హత్యలతో సుఖ దునెకెకు సంబంధం ఉందని, మాదక ద్రవ్యాలకు బానిసైన అతడు ఫేక్ వీసాతో కెనడాకు పారిపోయాడని ఆరోపిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. వాడు చేసిన తప్పులకు శిక్ష పడిందని, తమ శత్రువులు ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా బతకరని హెచ్చరించింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ డ్రగ్ స్మగ్లింగ్ కేసు ఆరోపణలతో అహ్మదాబాద్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్‌వాలా హత్య కేసులో కూడా లారెన్స్ బిష్ణోయ్ నిందితుడు. ఇప్పుడు సోషల్ మీడియాలో బిష్ణోయ్ గ్యాంగ్ పెట్టిన పోస్టును బట్టి ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ హస్తం ఉండే ఉంటుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. జూన్ నెలలో ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్-కెనడా మధ్య సంబంధాలు తగ్గాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో ఈ హత్య జరగడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని కెనడాలో ఉంటున్న భారతీయులు భయపడుతున్నారు.ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అక్కడి వారికి ట్రావెల్ అడ్వైజరీ మార్గదర్శకాలు చేసి వీసా సేవలను నిలిపివేసింది.