2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు కసరత్తు జరుగుతోంది. డీకే శివకుమార్ లేదా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. వీరిద్దరూ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే బాధ్యతను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించారు.

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు(Karnataka Election Results) వెలువడ్డాయి. కాంగ్రెస్(Congress) 135 స్థానాల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు కసరత్తు జరుగుతోంది. డీకే శివకుమార్(DK Shiva Kumar) లేదా సిద్ధరామయ్య(Siddaramaiah) ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. వీరిద్దరూ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే బాధ్యతను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించారు. మే 18వ తేదీ గురువారం కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.

ముఖ్యమంత్రి అభ్యర్థులు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjuna Kharge) నేడు భేటీ కానున్నారు. మే 15వ తేదీన శివకుమార్ పుట్టినరోజు కావడం వల్ల ఈ సమావేశం ప్రత్యేకంగా మారింది. ప్రస్తుతం ఆయన వయసు 61 ఏళ్లు. డీకే శివకుమార్ వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. చాలాసార్లు కాంగ్రెస్‌కు 'ట్రబుల్‌షూటర్‌'గా మారారు.

సిద్ధరామయ్య సహా పార్టీ నేతలతో కలిసి పుట్టినరోజు(Birth Day) జరుపుకుంటున్న చిత్రాన్ని శివకుమార్ ఆదివారం రాత్రి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ‘నా జీవితం కర్ణాటక ప్రజల సేవకే అంకితం. నా పుట్టినరోజు సందర్భంగా కర్ణాటక ప్రజలు నాకు బెస్ట్ బర్త్ డే గిఫ్ట్(Birthday Gift) ఇచ్చారు. శుభాకాంక్షలు తెలిపిన నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఢిల్లీలో సోనియా గాంధీ(Soniya Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi)లతో కూడా సిద్ధరామయ్య, శివకుమార్ భేటీ కానున్నారు. దీంతో డీకే కు బర్త్ డే గిఫ్ట్ ఉంటుందా అనే ఊహాగానాలు ఉన్నాయి.

ఇదిలావుంటే.. సిద్ధరామయ్య, శివకుమార్‌ల మద్దతుదారుల మధ్య ఆదివారం పోస్టర్ వార్(Poster War) జరిగింది. ఇరువురి మద్దతుదారులు తమ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. ఇక‌ ఆదివారం జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(Congress Legislature Party Meeting) సమావేశం ముఖ్యమంత్రిని ఎన్నుకునే హక్కును మల్లికార్జున్ ఖర్గేకు కల్పిస్తూ తీర్మానం చేసింది. ఈ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌(KC Venu Gopal)తో పాటు ముగ్గురు కేంద్ర పరిశీలకులు హాజరయ్యారు. ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు ఖర్గేకు ఎక్కువ సమయం పట్టదని కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రణదీప్ సూర్జేవాలా(Randeep Surjewala) అన్నారు. త్వరలో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి పేరును ప్రకటించనున్నారని తెలిపారు. ఈ సమావేశానికి పరిశీలకులుగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే(Susheel Kumar Shinde), పార్టీ నేతలు జితేంద్ర సింగ్(Jithendra Singh), దీపక్ బబారియా(Deepak Babaria) హాజరయ్యారు. ఈ సమావేశంలో జైరాం రమేష్(Jairam Ramesh), సిద్ధరామయ్య, శివకుమార్, వేణుగోపాల్ కూడా ఉన్నారు.

Updated On 14 May 2023 11:16 PM GMT
Yagnik

Yagnik

Next Story