ప్రజలకు చల్లటి వార్త చెప్పింది వాతావరణ శాఖ. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ(Kerala)ను తాకుతాయని ప్రకటించింది. రుతుపవనాల రాక ఇప్పటికే ఆలస్యం అయ్యింది. జనంతో వేసవి ఓ ఆట ఆడుకుంటోంది. పెరిగిన ఉష్ణోగ్రతలతో అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇది హాయినిచ్చే కబురే. బిపోర్‌జాయ్‌ తుఫాన్‌(Cyclone Biparjoy) కారణంగా రుతుపవనాల రాక మరింత ఆలస్యం కావచ్చేమోనని వాతావరణ శాఖ నిపుణులు అనుకున్నారు.

ప్రజలకు చల్లటి వార్త చెప్పింది వాతావరణ శాఖ. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ(Kerala)ను తాకుతాయని ప్రకటించింది. రుతుపవనాల రాక ఇప్పటికే ఆలస్యం అయ్యింది. జనంతో వేసవి ఓ ఆట ఆడుకుంటోంది. పెరిగిన ఉష్ణోగ్రతలతో అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇది హాయినిచ్చే కబురే. బిపోర్‌జాయ్‌ తుఫాన్‌(Cyclone Biparjoy) కారణంగా రుతుపవనాల రాక మరింత ఆలస్యం కావచ్చేమోనని వాతావరణ శాఖ నిపుణులు అనుకున్నారు. కానీ వారి అంచనా తప్పంది. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ఈ రుతుపవనాల రాక కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చల్లటి గాలులతో పాటు ఆగ్నేయ అరేబియా సముద్రంతో పాటు లక్షద్వీప్‌, కేరళ తీరాల ప్రాంతాలలో మేఘాల పెరుగుదల కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. లాస్టియర్‌ జూన్‌ 1వ తేదీనే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఈసారి కొంచెం ఆలస్యం అయ్యింది. అసలు జూన్‌ 1వ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. మొదట జూన్‌ 4వ తేదీ నాటికి కేరళ తీరం తాకొచ్చని అంచనా వేసినా అది జరగలేదు. బిపోర్‌జాయ్‌ తుఫాన్‌ ప్రభావంఓ అరేబియా సముద్రంలో రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నట్టు భావించారు. కాకపోతే ఈ రోజు రుతుపవనాల ఆచూకి కనిపించింది.

Updated On 7 Jun 2023 4:54 AM GMT
Ehatv

Ehatv

Next Story