2002 గుజరాత్‌(Gujarat) అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానో(Bilkis Bano)పై జరిగిన అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య మానవాళిపై దాడేనని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra) సుప్రీంకోర్టు(Supreme Court)కు తెలిపారు. 11 మంది దోషులను రెమిషన్‌పై విడుదల చేయడం అంటే మహిళలు, చిన్నారుల హక్కుల రక్షణలో గుజరాత్‌ ప్రభుత్వం(Gujarat Govt) విఫలమైందన్నారు.

2002 గుజరాత్‌(Gujarat) అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానో(Bilkis Bano)పై జరిగిన అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య మానవాళిపై దాడేనని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra) సుప్రీంకోర్టు(Supreme Court)కు తెలిపారు. 11 మంది దోషులను రెమిషన్‌పై విడుదల చేయడం అంటే మహిళలు, చిన్నారుల హక్కుల రక్షణలో గుజరాత్‌ ప్రభుత్వం(Gujarat Govt) విఫలమైందన్నారు. దోషుల విడుదలను సవాల్‌చేస్తూ దాఖలైన పిల్ అర్హతను తేల్చేందుకు జస్టిస్‌ బి.వి.నాగరత్న జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం ముందు గురువారం కూడా వాదనలు కొనసాగాయి. తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా తరపున సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ వాదనలు వినిపించారు. దోషులు 84 ఏళ్ళ పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉన్నప్పటికీ జైలు నుంచి వారిని అక్రమంగా విడుదల చేశారని వాదించారు. వాదనలు విన్న ధర్మసనం తదుపరి విచారణ ఈ నెల 11కు వాయిదా వేసింది.

బిల్కిస్ బానో ఎవరు కేసు ఏంటి ?

ఫిబ్రవరి 27, 2002న గోద్రాలో సబర్మతి రైలు దహనం తర్వాత గుజరాత్ హింసాత్మకంగా మారింది. రైలులో 50 మందికి పైగా కరసేవకులు మరణించారు. హింస చెలరేగుతుందనే భయంతో బిల్కిస్ తన మూడున్నరేళ్ల కూతురు, మరో 15 మంది కుటుంబ సభ్యులతో కలిసి రంధిక్‌పూర్ అనే తన గ్రామం నుంచి పారిపోయి ఛపర్వాద్ జిల్లాలో ఆశ్రయం పొందారు. మార్చి 3న బిల్కిస్ ఆమె కుటుంబ సభ్యులపై దాదాపు 30 మంది వ్యక్తులు కొడవళ్లు, కత్తులు, కర్రలతో దాడి చేశారు.

బిల్కిస్, ఆమె తల్లి, మరో ముగ్గురు మహిళలపై అత్యాచారం చేసి దారుణంగా దాడి చేశారు. దాడి అనంతరం కేవలం బిల్కిస్ ఆమె మూడేళ్ల చిన్నారి మాత్రమే బైటపడగలిగారు. నివేదికల ప్రకారం, సంఘటన జరిగిన మూడు గంటల తర్వాత బిల్కిస్ స్పృహలోకి వచ్చి ఒక ఆదివాసీ మహిళ నుండి బట్టలు తీసుకున్న తర్వాత హోమ్ గార్డు సహాయంతో ఫిర్యాదు నమోదు చేయడానికి లింఖేడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.

వైద్య పరీక్షల నిమిత్తం బిల్కిస్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె కేసును నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) తో పాటు సుప్రీం కోర్టు స్వీకరించింది. ఈ ఘటనపై సిబిఐ తో దర్యాప్తుకు ఆదేశించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 11 మందిని 2004లో అరెస్టు చేసి అహ్మదాబాద్‌లో విచారణ ప్రారంభించారు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలు దెబ్బతినే అవకాశం ఉందని బిల్కిస్ ఆందోళన వ్యక్తం చేయడంతో, సుప్రీం కోర్టు కేసును ముంబైకి బదిలీ చేసింది.

2008లో, భారతీయ శిక్షాస్మృతి ప్రకారం గర్భిణీ స్త్రీపై అత్యాచారం, హత్య ఆరోపణలపై 11 మంది వ్యక్తులకు ప్రత్యేక సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. సాక్ష్యాధారాలు లేకపోవడంతో మరో ఏడుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిందితుల్లో ఒకరు విచారణ సమయంలో మరణించారు.

2017లో, సామూహిక అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు 11 మంది దోషులకు జీవిత ఖైదును సమర్థించింది. 2019లో సుప్రీంకోర్టు బిల్కిస్‌కు రూ. 50 లక్షల పరిహారం చెల్లించింది.

దోషులు విడుదలయ్యారు

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 432, 433 కింద శిక్షను తగ్గించాలని కోరుతూ దోషుల్లో ఒకరు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అతని రిమిషన్‌పై నిర్ణయం తీసుకునే "సముచిత ప్రభుత్వం" మహారాష్ట్రదే కాని గుజరాత్ కాదని గమనించిన హైకోర్టు అతని అభ్యర్థనను కొట్టివేసింది.

1 ఏప్రిల్ 2022 నాటికి తాను 15 సంవత్సరాల నాలుగు నెలల పాటు ఎలాంటి ఉపశమనం లేకుండా జైలులో ఉన్నానని షా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆయన శిక్షను తగ్గించే అంశాన్ని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

కమిటీ నిర్ణయం ప్రకారం గుజరాత్ ప్రభుత్వం 11 మంది దోషులను విడుదల చేసింది.

Updated On 11 Aug 2023 2:32 AM GMT
Ehatv

Ehatv

Next Story