బీహార్‌లోని(Bihar) గయ జిల్లాలో బిహియాన్(Bihiyan) అనే ఊరుంది.

బీహార్‌లోని(Bihar) గయ జిల్లాలో బిహియాన్(Bihiyan) అనే ఊరుంది. ఈ ఊరికి ఓ చరిత్ర ఉంది. మూడు శతాబ్దాలుగా ఇక్కడి ప్రజలు నియమ నిష్ఠలతో, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఆచారాలను పాటిస్తూ వస్తున్నారు. 300 ఏళ్ల నుంచి ఈ గ్రామస్థులు శాకాహారులుగానే(Veg) కొనసాగుతున్నారు. వీరు పూజించే బ్రహ్మ బాబా ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే శాకాహార జీవన విధానాన్నే అవలంబించాలన్నది వీరి నమ్మకం. ఈ తరం వారు కూడా ఈ నియమాన్ని పాటిస్తున్నారు. ఇక్కడి వారిని పెళ్లి చేసుకుని వచ్చే వారు కూడా ఇదే జీవన విధానాన్నే అనుసరిస్తూ, శాకాహారులుగానే మారుతున్నారు. వీరు మద్యపానానికి దూరంగా ఉంటారు. ఉల్లి, వెల్లుల్లి కూడా తినరు. ఈ ఊరిలో 400 కుటుంబాలు ఉన్నాయి.

Eha Tv

Eha Tv

Next Story