బీహార్‌లో(Bihar) కుటుంబనియంత్రణ(family planning Operation) చేసుకున్న ఓ మహిళ గర్భవతి(Pregnant) అయింది. ఇలా ఒకసారి కాదు, రెండు కాదు.. మూడు సార్లు ఆ మహిళ గర్భం దాల్చింది. బీహార్‌లోని ముజఫర్‌నగర్ దగ్గరలోని కేవత్స గ్రామంలో ఉంటున్న ఓ మహిళ (35) 2015లో గైఘాట్ ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. అప్పటికే ఆమెకు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు.

Bihar woman Pregnancy

2015లో ఆ మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఆ మహిళ గర్భం దాల్చడంతో షాక్ అయ్యారు. 2018లో మగబిడ్డకు జన్మనిచ్చింది. దీనిపై అప్పటి సివిల్ సర్జన్(Civil surgeon) డాక్టర్ జ్ఞాన్ శంకర్‌పై(Gyan Shankar) ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. 2020లో మరోసారి ఆ మహిళ గర్భం దాల్చిన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ దంపతులు మరోసారి ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారికి పరిహారంగా రూ.6 వేలు అందించారు. అయితే తాజాగా ఆమె మరోసారి గర్భం దాల్చడంతో ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆమె భర్త స్పందిస్తూ ఆపరేషన్ చేయించుకునే వరకే తమకు నలుగురు సంతానమని.. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆపరేషన్ విఫలం కావడంతో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తన భార్య.. మళ్లీ గర్భవతైందని చెప్పాడు. తాను కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నానని ఇప్పుడు 9 మంది ఉన్న తమ కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబ నియంత్రణ సమస్యను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం నితీష్ కుమార్ పదేపదే చెప్తున్నా కానీ బీహార్ జనాభా నియంత్రణలో లేదు. ముజఫర్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.