మీరు ఎప్పుడైనా కాలిఫోర్నియం(Californium) విన్నారా?

మీరు ఎప్పుడైనా కాలిఫోర్నియం(Californium) విన్నారా? అత్యంత విలువైన రేడియోధార్మిక పదార్థం ఇది. సింథటిక్‌ కెమికల్ ఎలిమెంట్(sythetic chemical element) ఇది. కెమిస్ట్రీ చదువుకున్న వారికి తెలుసు. ఆవర్తన పట్టికలో(Periodic table) (మూలకాల)లో ఉంటుంది. పరమాణు సంఖ్య(Atomic number) 98. ఇప్పుడెందుకు కాలిఫోర్నియం ప్రస్తావన అంటే బీహార్‌లోని(bihar) గోపాల్‌గంజ్‌(Gopalganj) జిల్లా పోలీసులు ముగ్గురు వ్యక్తుల దగ్గర దీన్ని స్వాధీనం చేసుకున్నారు. లాల్ ప్రసాద్, చందన్‌ గుప్తా, చందన్‌రామ్‌ అనే వ్యక్తులు ఈ రేడియో ధార్మిక పదార్థాన్ని అమ్మడానికి కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు. వీరి దగ్గర ఉన్నది 50 గ్రామల కాలిఫోర్నియమే కానీ దాని ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 850 కోట్ల రూపాయల పైనే ఉంటుంది. ‘మా జిల్లా నుంచి విలువైన రేడియో ధార్మిక పదార్థాన్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం మాకు అందింది. గురువారం ఉత్తర్‌ప్రదేశ్‌-బిహార్‌ సరిహద్దుల్లో మోటార్‌ సైకిల్‌పై వస్తున్న నిందితులను తనిఖీ చేయగా.. నాలుగు మొబైల్‌ ఫోన్లతోపాటు 50 గ్రాముల కాలిఫోర్నియం దొరికింది' అని జిల్లా ఎస్పీ స్వర్ణ్‌ భారత్‌ తెలిపారు. కాలిఫోర్నియంను పోర్టబుల్‌ మెటల్‌ డిటెక్టర్లలో వినియోగిస్తారు. అణుశక్తి ఉత్పత్తకి, మెదడు కేన్సర్‌ చికిత్సలోనూ దీనికి ఉపయోగిస్తారు. కాలిఫోర్నియంతో బంగారం, వెండి ఇతర విలువైన లోహాలను గుర్తించవచ్చు. దీంతోపాటు ఇంధన బావుల్లో నీరు, చమురు పొరలను గుర్తించేందుకు ఉపయోగిస్తారు.

Eha Tv

Eha Tv

Next Story