నర్సుపై డాక్టర్‌ అత్యాచారయత్నం

కోల్‌కతాలో(Kolkata) ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం(Rape), హత్యతో దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసిన ఒక నెల తర్వాత, బీహార్‌లోని(Bihar) ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుపై(Nurse) సామూహిక అత్యాచారయత్నం(Gang rape) జరిగింది. దాడి చేసిన వారిలో ఒకరు వైద్యుడని, అతను సంస్థ నిర్వాహకుడని, నర్సు అతని ప్రైవేట్ భాగాలపై(Private part) బ్లేడుతో కోసి తప్పించుకోగలిగిందని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి సమస్తిపూర్ జిల్లాలోని ముశ్రీఘరారారి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగాపూర్‌లోని ఆర్‌బిఎస్ హెల్త్ కేర్ సెంటర్‌లో నర్సు పని ముగించుకుని ఉండగా, ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ సంజయ్ కుమార్, అతని ఇద్దరు సహచరులు వీరంతా మద్యం మత్తులో ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. డాక్టర్ కుమార్, అతని స్నేహితుల బారి నుంచి తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నించిన నర్సు బ్లేడ్‌తో డాక్టర్ జననాంగాలపై కోసింది. ఆసుపత్రి బయట పొలంలో దాక్కున్న ఆమె తప్పించుకుని పోలీసులకు డయల్ చేసింది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ పాండే మాట్లాడుతూ నర్సు సురక్షితంగా ఉందని తెలిపారు.డాక్టర్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు నిందితులను సునీల్ కుమార్ గుప్తా, అవధేష్ కుమార్‌లుగా గుర్తించారు. నర్సుపై లైంగిక దాడికి ప్రయత్నించే ముందు పురుషులు ఆసుపత్రిని లోపలి నుండి తాళం వేసి సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేశారని పోలీసులు తెలిపారు. సగం మద్యం సీసా, నర్సు ఉపయోగించిన బ్లేడ్, రక్తంతో తడిసిన బట్టలు, మూడు సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సుపై దాడి చేయడానికి ప్రయత్నించే ముందు ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించారని బీహార్‌లో మద్యం విక్రయించిందుకు అనుమతులు లేవని, నిషేధ చట్టాల ప్రకారం వారిపై కూడా అభియోగాలు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.

Updated On 13 Sep 2024 10:47 AM GMT
Eha Tv

Eha Tv

Next Story