అమ్మాయిలు ఇంటి దీపం అని గర్వంగా చెప్పుకుంటారు. అమ్మాయి పుడితే లక్ష్మీ దేవి వచ్చిందని సంబరపడతారు. చదువుల సరస్వతి ఇంటవెలసింది అని పండుగ చేసుకుంటారు. చాలా మందికి మాత్రం ఆడపిల్ల పుడితే బాధపడతారు. కొడుకు కోసం ఎన్ని కాన్పులనైనా భరిస్తారు తల్లులు! బీహార్‌(Bihar) సరాన్‌ జిల్లా మాంఝీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నచాప్‌ గ్రామానికి చెందిన కమల్‌సింగ్‌(Kamal Singh), శారదా దేవి(Sharada Devi) దంపతులకు ఏడుగురు అమ్మాయిలు.

అమ్మాయిలు ఇంటి దీపం అని గర్వంగా చెప్పుకుంటారు. అమ్మాయి పుడితే లక్ష్మీ దేవి వచ్చిందని సంబరపడతారు. చదువుల సరస్వతి ఇంటవెలసింది అని పండుగ చేసుకుంటారు. చాలా మందికి మాత్రం ఆడపిల్ల పుడితే బాధపడతారు. కొడుకు కోసం ఎన్ని కాన్పులనైనా భరిస్తారు తల్లులు! బీహార్‌(Bihar) సరాన్‌ జిల్లా మాంఝీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నచాప్‌ గ్రామానికి చెందిన కమల్‌సింగ్‌(Kamal Singh), శారదా దేవి(Sharada Devi) దంపతులకు ఏడుగురు అమ్మాయిలు. కొడుకు ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఏడుగురు ఆడపిల్లలను కనుకుంటూ వెళ్లారు. తర్వాత కొడుకు పుట్టాడు. వారి కోరిక అయితే తీరింది కానీ ఎనిమిది మంది పిల్లలను పోషించడం వారికి కష్టమయ్యింది. వారు ఇబ్బంది పడుతుంటే గ్రామస్తులు నవ్వుకునేవారు. అమ్మాయిల పెళ్లిళ్లు ఎలా చేస్తారంటూ హేళన చేసేవారు. గ్రామస్తుల వెక్కిరింతలు భరించలేక వారు గ్రామాన్ని విడిచిపెట్టి ఛప్రా జిల్లాలోని ఎక్మా గ్రామానికి వెళ్లారు. అక్కడ ఓ పిండిగిర్నీ పెట్టుకుని జీవితాన్ని నెట్టుకొచ్చారు కమల్‌సింగ్‌-శారదాదేవి దంపతులు. వారికి పిల్లలు కూడా చేదోడువాదోడుగా ఉండేవారు. ఆ దంపతులు అమ్మాయిలపై ఎలాంటి వివక్ష చూపలేదు. కొడుకు సమానంగా కూతుళ్లను పెంచి పెద్ద చేశారు. అలా పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యి ప్రయోజకులుగా మారారు. అక్కాచెల్లెళ్లు ఏడుగురూ పోలీస్‌ ఉద్యోగా(Police job) సంపాదించారు. వారిలో కొందరు బీహార్‌ పోలీస్‌ శాఖలో, మరికొందరు ఎక్సైజ్‌ శాఖలో, మిగిలిన వారు వివిధ కేంద్ర బలగాల్లో ఉద్యోగులుగా ఉన్నారు. ఆ ఏడుగురు అక్కాచెల్లెళ్లే ఒకరికొకరు మార్గదర్శకులుగా ఉంటూ సక్సెసయ్యారు. అవమానాలు ఎదుర్కొన్న తల్లిదండ్రులు గర్వించేలా చేశారు. ఆడబిడ్డలు భారమని తాము ఎప్పుడూ అనుకోలేదని, వారిని పెంచి పెద్ద చేసి చదువు చెప్పిస్తే వారి బతుకు వారు బతుకుతారని అనుకునేవాడినని కమల్‌సింగ్‌ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారని, తాను అనుకున్నదాని కంటే గొప్పగా బతుకుతున్నారని తండ్రి మురిసిపోతున్నాడు. కొసమెరుపు ఏమిటంటే తల్లిదండ్రులు, చిన్నవాడైన తమ్ముడి మీద మమకారంతో ఆ ఏడుగురు అక్కా చెళ్లెల్లు నాలుగంతస్తుల భవనం కట్టించారు.

Updated On 27 March 2024 1:44 AM GMT
Ehatv

Ehatv

Next Story