ఎట్టకేలకు బీహార్ (Bihar) ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ (Nitish Kumar) మహిళలకు క్షమాపణలు (Apology) చెప్పారు. జనాభా నియంత్రణ (Population Control ) విషయంలో నితీశ్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

Bihar CM Nitish Kumar
ఎట్టకేలకు బీహార్ (Bihar) ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ (Nitish Kumar) మహిళలకు క్షమాపణలు (Apology) చెప్పారు. జనాభా నియంత్రణ (Population Control ) విషయంలో నితీశ్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే మహిళలు చదువుకుంటే భర్తలను అదుపులోకి పెట్టి జనాభాను తగ్గిస్తారని అని అన్నారు. మహిళలు విద్యావంతులైతే కలయిక సమయంలో భర్తలను కంట్రోల్‌లో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని అన్నారు. మహిళలు విద్యావంతులు (women's education) అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని అసెంబ్లీ సాక్షిగా నితీశ్ అన్నారు. నితీశ్‌కుమర్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ (Rekha Sharma ), ఢిల్లీ మహిళా ప్యానెల్ హెడ్ స్వాతి మలివాల్‌ను తీవ్రంగా మండిపడ్డారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మహిళల హక్కులను భంగపరిచేవిలా ఉన్నాయని తెలిపారు. నితీశ్ వ్యాఖ్యలను బీజేపీ కూడా ఖండించింది. ఆయన మహిళా ద్వేషి అని, ఆయనది పితృస్వామ్య భావజాలమని విమర్శించింది. ఇంత చౌకబారు పదజాలాన్ని వాడిన ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
