బీహార్(Bihar) ముఖ్యమంత్రి నితీష్ కుమార్(CM Nitish Kumar) రోజువారీ మార్నింగ్ వాక్‌లో(Morning walk) భద్రతా లోపం చోటుచేసుకుంది. పాట్నాలో(Patna) గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రి తన నివాసం నుంచి సర్క్యులర్ రోడ్డులోని సర్క్యులర్ హౌసింగ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది

Nitish kummar
బీహార్(Bihar) ముఖ్యమంత్రి నితీష్ కుమార్(CM Nitish Kumar) రోజువారీ మార్నింగ్ వాక్‌లో(Morning walk) భద్రతా లోపం చోటుచేసుకుంది. పాట్నాలో(Patna) గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రి తన నివాసం నుంచి సర్క్యులర్ రోడ్డులోని సర్క్యులర్ హౌసింగ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక గుర్తుతెలియని ద్విచక్ర వాహనదారుడు భద్రతా వలయాన్ని దాటుకుని నితీష్ కుమార్ మార్నింగ్ వాక్ చేసే మార్గం.. సర్క్యులర్ రోడ్‌లోకి నేరుగా ప్రవేశించాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హఠాత్తు పరిణామంతో ముఖ్యమంత్రి తన భద్రత కోసం.. వేగంగా రోడ్డుపై నుంచి కాలిబాటపైకి దూకాల్సి వచ్చింది. అయితే ద్విచక్ర వాహనదారుడిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఘటన తర్వాత భద్రతా సిబ్బంది ముఖ్యమంత్రిని నివాసానికి తీసుకెళ్లారు. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
