పాట్నా యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో నితీష్ కుమార్ జారిపడి పడిపోయారు. భద్రతా సిబ్బంది ఆయ‌న‌ను వెంట‌నే పైకి లేపారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ( CM Nitish Kumar) మంగళవారం జారిప‌డిపోయారు. ఆయ‌న వెంటే ఉన్న భద్రతా సిబ్బంది.. వేగంగా ముందుకు వెళ్లి ఆయ‌న‌ చేయి పట్టుకున్నారు. ముఖ్యమంత్రికి ఎలాంటి గాయాలు కాక‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తర్వాత సీఎం నితీశ్ కుమార్ కూడా నవ్వుతూ కనిపించారు.

పాట్నా యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో నితీష్ కుమార్ జారిపడి పడిపోయారు. భద్రతా సిబ్బంది ఆయ‌న‌ను వెంట‌నే పైకి లేపారు. బీహార్(Bihar) ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ( CM Nitish Kumar) మంగళవారం జారిప‌డిపోయారు. ఆయ‌న వెంటే ఉన్న భద్రతా సిబ్బంది.. వేగంగా ముందుకు వెళ్లి ఆయ‌న‌ చేయి పట్టుకున్నారు. ముఖ్యమంత్రికి ఎలాంటి గాయాలు కాక‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తర్వాత సీఎం నితీశ్ కుమార్ కూడా నవ్వుతూ కనిపించారు.

పాట్నా యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆయ‌న‌తో పాటు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించేందుకు ఒకవైపు సీఎం రాగానే కాలు జారి కిందపడ్డారు. అసౌకర్యంగా ఉన్న ముఖ్యమంత్రిని చూసిన భద్రతా సిబ్బంది వెంటనే ఆయనను పైకి లేపారు. ఈ సమయంలో పలువురు మీడియా ప్రతినిధులు కూడా అక్కడే ఉన్నారు. మీడియా సిబ్బంది ఈ ఘటనను కెమెరాలో బంధించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated On 5 Sep 2023 6:07 AM GMT
Ehatv

Ehatv

Next Story