దేశంలో 75 కోట్ల మంది వ్యక్తిగత వివరాల డేటా హ్యాకర్ల (Hackers)చేతిలోకి వెళ్లింది. దీంతో వ్యక్తిగత వివరాలు ప్రమాదంలో పడ్డాయి. సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ప్రజల ప్రైవేట్‌ డేటాను చోరీ చేసి వాటిని అమ్మకానికి పెడుతున్నారు. దీనివల్ల ప్రజల భద్రత ప్రమాదంలో పడుతోంది. ఈ క్రమంలోనే 75 కోట్ల మంది వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రమాదంలో పడేసిన ఓ కొత్త డేటాబేస్ లీక్(Database leak) తాజాగా బయటపడింది. పేర్లు(Names), మొబైల్ నంబర్లు(Mobile Numbers), చిరునామాలు(Addresses), ఆధార్ (Aadhar)వివరాలతో సహా 1.8 టెరాబైట్ల డేటా లీకైనట్లు సమాచారం.

ఇండియన్ మొబైల్ నెట్‌వర్క్ కన్స్యూమర్ డేటాబేస్ నుంచి 75 కోట్ల మంది డేటాను సైబోడెవిల్ (Cybo Devil) అనే హ్యాకర్ చోరీ చేశాడు. అంతేకాదు ఈ సమాచారాన్నంతా డార్క్ వెబ్‌లో 3 వేల డాలర్లకి అమ్మకానికి పెట్టాడు. ఈ లీక్‌ను ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్‌సెక్ (Cloud SEK) గుర్తించింది. డేటా చౌర్యంపై ఇది హెచ్చరించింది. దీనిపై క్లౌడ్‌సెక్‌కు చెందిన కులశ్రేష్ఠ మాట్లాడారు. ఇది ఆందోళనకలిగించే అంశమని.. 75 కోట్ల మందిపై సైబర్‌ అటాక్‌(Cyber Attack) జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. దీనిపై టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వం డేటాను వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు కూడా తమ వ్యక్తిగత వివరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ డేటా లీక్‌ అన్ని టెలికాం ప్రొవైడర్లపై(Telecom providers) పడుతుందన్నారు. లీకైన డేటా 1.8 టెరాబైట్లను కంప్రెస్ చేసి 600 జీబీకి కుదించినట్లు తెలుస్తోంది. టెలికాం ప్రొవడైర్లు తమ వినియోగదారుల డేటా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాయని నిపుణులు చెప్తున్నారు. ప్రజలపై సైబర్‌ దాడులు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రజల వ్యక్తిగత డేటాకు ప్రొటెక్షన్‌ ఇవ్వకుంటే చివరగా నష్టపోయేది ప్రజలేనంటున్నారు.

Updated On 27 Jan 2024 7:24 AM GMT
Ehatv

Ehatv

Next Story