తన స్నేహితుడు తనని అత్యాచారం చేశాడని బిగ్‌బాస్‌(Bigg Boss) కంటెస్టెంట్ ఫిర్యాదు చేసింది. ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీలో డియోలి రోడ్ ఫ్లాట్‌లో తన స్నేహితుడే తనని అత్యాచారం చేశాడని ముంబైకి చెందిన ప్రముఖ నటి, మోడల్, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఢిల్లీ(Delhi) పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన స్నేహితుడు తనని అత్యాచారం చేశాడని బిగ్‌బాస్‌(Bigg Boss) కంటెస్టెంట్ ఫిర్యాదు చేసింది. ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీలో డియోలి రోడ్ ఫ్లాట్‌లో తన స్నేహితుడే తనని అత్యాచారం చేశాడని ముంబైకి చెందిన ప్రముఖ నటి, మోడల్, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఢిల్లీ(Delhi) పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి తాను స్పృహ కోల్పోయాక అత్యాచారం(Molestation) చేశాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ బాధితురాలి ఫిర్యాదుతో ఓ వ్యక్తిపై టిగ్రీ పోలీస్ స్టేషన్‌లో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (రేప్) కింద ఎఫ్‌ఐఆర్(FIR) నమోదు చేశామని తెలిపారు. ఇప్పటివరకు ఎటువంటి అరెస్టు చేయలేదు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి బృందాలు ఏర్పాటు చేశామని అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

అయితే బాధితురాలు బిగ్ బాస్‌ రియాలిటీ షోలో పాల్గొన్న నటి ప్రజాదరణ పొందింది. ముంబైకి చెందిన ఆమె మోడల్‌గానూ, టెలివిజన్ సీరియల్స్‌లోనూ పనిచేసింది. నిందితుడు ఆమెను తన ఇంటికి డిన్నర్‌కు పిలిచాడని..ఇంటికి వచ్చిన తర్వాత స్పైక్డ్‌ డ్రింక్‌ ఇచ్చాడని తెలిపింది. తాను స్పృహలో లేనప్పుడు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. దీంతో ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Updated On 1 Feb 2024 12:37 AM GMT
Ehatv

Ehatv

Next Story