సభలు, సమావేశాలలో మంత్రులు కునుకు తీయొచ్చు కానీ, అధికారులు కునుకుతీయకూడదు. ఆవలింతలు వచ్చినా ఆపుకోవాలి. లేకపోతే ప్రమాదం. పాపం ఈ విషయం తెలియని ఓ అధికారి గుజరాత్ ముఖ్యమంత్రి(Gujarat CM) ప్రసంగిస్తున్న సభలో చక్కగా నిద్రపోయాడు. లోకల్ మీడియాలో పదే పదే ఆయన కునుకు తీస్తున్న దృశ్యాలు రావడం కారణంగానే విషయం పది మందికి తెలిసింది. లేకపోతే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు.
సభలు, సమావేశాలలో మంత్రులు కునుకు తీయొచ్చు కానీ, అధికారులు కునుకుతీయకూడదు. ఆవలింతలు వచ్చినా ఆపుకోవాలి. లేకపోతే ప్రమాదం. పాపం ఈ విషయం తెలియని ఓ అధికారి గుజరాత్ ముఖ్యమంత్రి(Gujarat CM) ప్రసంగిస్తున్న సభలో చక్కగా నిద్రపోయాడు. లోకల్ మీడియాలో పదే పదే ఆయన కునుకు తీస్తున్న దృశ్యాలు రావడం కారణంగానే విషయం పది మందికి తెలిసింది. లేకపోతే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఠాట్.. సీఎం పాల్గొన్న సభలో పాల్గొని, ఆయన ప్రసంగిస్తున్నప్పుడు పడుకుంటావా? అని ఫైరయ్యింది ప్రభుత్వం. ఆ మాత్రం అంకితభావం లేకుంటే ఎలా అంటూ సస్పెన్షన్ వేటు వేసింది. అసలేం జరిగిదంటే కచ్చ్ జిల్లా(Kachchh District)లో 2001 నాటి గుజరాత్ భూకంప బాధితులకు పునారాసంలో భాగంగా 14 వేల ఇళ్ల పట్టాలను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్(Bhupendrabhai Patel) అందించారు. భుజ్(Bhuj)లో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టాల పంపిణీ అనంతరం సీఎం ప్రసంగించారు. ముందు వరుసలో కూర్చొన్న భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్(Jigar Patel)కళ్లను నిద్ర కమ్మేసింది. పాపం ఎంత ఆపుకుందామనుకున్నా కంట్రోల్ కాలేదు. ఆయన కళ్లుమూసి కునుకు తీస్తూ కెమెరాల కంటపడ్డారు. అంతే ఆ దృశ్యాలు లోకల్ మీడియాల(Local Media)లో, సోషల్ మీడియా(Social Media)లలో వైరల్ అయ్యాయి. ఫలితంగా గంటల వ్యవధిలోనే రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
చేస్తున్న డ్యూటీ పట్ల అంకితభావం కొరవడటం, నిర్లక్ష్యం వహించడం వంటి కారణాలు చూపారు అధికారులు. గుజరాత్ సివిల్ సర్వీస్ రూల్స్ 1971, రూల్ 5(1)(a) ప్రకారం జిగర్ పటేల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ మనీష్ షా(Manish Shah).