ఆత్మలు(Spirits), దెయ్యాలు(Ghost) లేనే లేవంటారు కొందరు. చాలా మంది ఆత్మలున్నాయంటారు. ఆత్మలున్నాయి కాబట్టి దెయ్యాలు కూడా ఉండి తీరతాయన్నది మరికొందరి వాదన. అసలు దెయ్యాలను చూశారో లేదో తెలియదు కానీ దెయ్యాల గురించి మాత్రం కథలు కథలుగా చెబుతుంటారు.. ఊళ్లల్లో అయితే ఈ నమ్మకం ఎక్కువగానే ఉంటుంది. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే దెయ్యం పట్టిందని అంటారు. అలా పట్టిన దెయ్యాన్ని వదిలించే భూత వైద్యులు కూడా మనకు అక్కడక్కడ తారసపడుతుంటారు.

ఆత్మలు(Spirits), దెయ్యాలు(Ghost) లేనే లేవంటారు కొందరు. చాలా మంది ఆత్మలున్నాయంటారు. ఆత్మలున్నాయి కాబట్టి దెయ్యాలు కూడా ఉండి తీరతాయన్నది మరికొందరి వాదన. అసలు దెయ్యాలను చూశారో లేదో తెలియదు కానీ దెయ్యాల గురించి మాత్రం కథలు కథలుగా చెబుతుంటారు.. ఊళ్లల్లో అయితే ఈ నమ్మకం ఎక్కువగానే ఉంటుంది. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే దెయ్యం పట్టిందని అంటారు. అలా పట్టిన దెయ్యాన్ని వదిలించే భూత వైద్యులు కూడా మనకు అక్కడక్కడ తారసపడుతుంటారు.

అసలు పట్టిన దెయ్యాలను వదిలించడానికి ఓ భూత్‌ మేళనే(Gosht Mela) జరుగుతుందన్న విషయం తెలుసా? దెయ్యం పట్టిందనే నమ్మకంతో ఉన్నవారంతా ఝార్ఖండ్‌లోని(Jharkhand) పాలము(Palamu) జిల్లా హైదర్‌నగర్‌కు(Hydernagar) వెళతారు. చైతీ నవరాత్రుల సమయంలో జరిగే ఈ జాతర కోసం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తుంటారు. అక్కడికి వచ్చేవారిలో చాలా మంది తమ శరీరంలో దెయ్యం దూరిందని నమ్ముతుంటారు.

అక్కడి తతంగం భయంకరంగా ఉంటుంది. బాధితుల అరుపులు, కేకలతో ఆ ప్రాంతం మారుమోగిపోతుంది. అస్పష్టంగా మంత్రాలు వినిపిస్తుంటాయి. మేకలు, కోళ్లు బలవుతుంటాయి. రక్తం పారుతూ ఉంటుంది. భరించలేని వాసన ముక్కు పుటాలను తాకుతుంటుంది. ఈ భూత్‌ మేళ ఝార్ఖండ్‌ రాష్ట్ర పోలీసు అధికారుల కళ్ల ముందే జరుగుతుంటుంది కానీ వారు చూసి చూడనట్టుగా ఉంటారు. దెయ్యం పట్టిందని గుడ్డిగా నమ్మేవారిలో చాలా మంది చనిపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉండటం విషాదం.

భూత్‌మేళాలోని మాంత్రికులు ఒక్కొక్కరు ఒక్కో పద్దతిని అవలంబిస్తుంటారు. కొందరు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తారు. మరికొందరు నల్లటి దుస్తులు వేసుకుంటారు. కళ్లకు కాటుక పెట్టుకుంటారు. అన్నట్టు మంత్రగాళ్లు కూడా స్థానికులు కాదు. వారు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. బీహార్‌లోని రోహతాస్‌ నుంచి వచ్చిన భూతవైద్యుడి ట్రీట్‌మెంట్‌ చిత్రంగా ఉంటుంది. దెయ్యం పట్టిన వ్యక్తి ఎదురుగా నిలుచుని మంత్రాలు చదువుతుంటాడు. కాసేపటికి అతడి అసిస్టెంట్‌ రెండు పావురాలను తీసుకొస్తాడు.

మంత్రగాడు ఓ పావురాన్ని చేత పట్టుకుని మంత్రాలు చదువుతాడు. పావురం శరీరంలో మూడు నాలుగు చోట్ల గోళ్లతో పొడుస్తాడు. తర్వాత ఆ పావురాన్ని ఎగురవేస్తాడు. దెయ్యం పావురంలోకి ప్రవేశించి ఎగిరిపోయిందని చెబుతాడు. పాపం గాయపడిన ఆ పావురం ఎక్కువ దూరం ఎగరలేదు. మహా అయితే ఓ అయిదు కిలోమీటర్లు గాల్లో ఎగిరి కిందపడిపోతుంది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దాన్ని పట్టుకుని టవల్‌లో చుట్టకుని వెళ్లిపోతాడు. గాయాలకు మందు పూసి నయం చేస్తాడు. పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి భూతవైద్యులు పది నుంచి పదిహేను వేలు తీసుకుంటారు.. భక్తులు తోచింది ఇస్తే అసలు తీసుకోరు. ఆశ్చర్యకరమైన విషయమేమింటే ఇక్కడికి ఉన్నత చదువులు చదివినవారు కూడా రావడం.

దిగ్భ్రాంతి కలిగించే మరో సంగతేమిటంటే వారంతా దెయ్యాలు ఉన్నాయని నమ్మడం. కొందరైతే దెయ్యాలను చూశామని చెబుతుంటారు. కొన్ని స్వచ్చంద సంస్థలు ఇలాంటి మూఢనమ్మకాలను తొలగించడానికి ప్రయత్నించాయి కానీ. అందులో విఫలం చెందుతున్నాయి. భూత్‌మేళాకు చికిత్స కోసం వచ్చే వారికి మంత్రగాళ్లు అన్నీ అబద్ధాలే చెబుతారు. ఫలానా వ్యక్తి చేసిన తాంత్రిక పూజల కారణంగానే నీకు ఇలా జరిగిందని అంటారు. పాపం చాలా మంది ఇది నిజమేననుకుని ఆ వ్యక్తిపై మూక దాడులు చేస్తుంటారు. చెట్టుకు కట్టేసి కొడతారు. మంత్రాలు చదవడానికి వీలు లేకుండా పళ్లు ఊడగొట్టడం లాంటి దాడులు చేస్తారు. ఇలా దాడులకు గురయ్యేవారిలో 90 శాతం మంది మహిళలే కావడం విషాదం.

Updated On 21 July 2023 4:58 AM GMT
Ehatv

Ehatv

Next Story