వివాహేతర సంబంధాల(Extra Marital Affair) వల్ల హత్యలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో(Uttar Pradesh) ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. ఒక చోట భర్తను(Husband) హత్య చేయగా, మరో చోట భార్యను(Wife) భర్త చంపారు. వివరాల్లోకి వెళ్తే.. లక్నోలో(Lucknow) పోలీస్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న సతీష్‌సింగ్‌కు(Satish Singh) పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో సతీష్‌సింగ్‌కు భార్య భావనాసింగ్‌తో(Bhavana Singh) పలుసార్లు గొడవలు జరిగేవి. పలుమార్లు హెచ్చరించినా సతీష్‌సింగ్ తన పద్ధతి మార్చుకోలేదు.
వివాహేతర సంబంధాల(Extra Marital Affair) వల్ల హత్యలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో(Uttar Pradesh) ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. ఒక చోట భర్తను(Husband) హత్య చేయగా, మరో చోట భార్యను(Wife) భర్త చంపారు. వివరాల్లోకి వెళ్తే.. లక్నోలో(Lucknow) పోలీస్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న సతీష్‌సింగ్‌కు(Satish Singh) పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో సతీష్‌సింగ్‌కు భార్య భావనాసింగ్‌తో(Bhavana Singh) పలుసార్లు గొడవలు జరిగేవి. పలుమార్లు హెచ్చరించినా సతీష్‌సింగ్ తన పద్ధతి మార్చుకోలేదు. దీంతో ఆగ్రహించిన భార్య, ఆమె సోదరుడు దేవేంద్ర కుమార్ వర్మ(Devendra Kumar varma) కలిసి ఆదివారం రాత్రి సతీష్‌సింగ్‌ను హత్య చేశారు. పలుసార్లు భార్య, బావమరిది కలిసి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్‌స్పెక్టర్ సతీష్ సింగ్ అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చినట్లు పోలీస్ అధికారి తెలిపారు. సతీష్ సింగ్ భార్య భావనా సింగ్, అతనికి మధ్య ఈ అక్రమ సంబంధాల నేపథ్యంలో గొడవలు జరుగుతుండేవని, సోదరి బాధ చూడలేక దేవేంద్ర కుమార్ సతీష్ సింగ్ హత్యకు ప్లాన్ చేశాడు. ఇద్దరు కలిసి అతడిని హత్య చేసినట్లు లక్నో సౌత్ డీసీపీ వినీత్ జైస్వాల్ తెలిపారు. 400 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను పట్టుకున్నట్లు వెల్లడించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోనే మరో ఘటన జరిగింది. బరేలీ(Bareli) జిల్లాలోని గోటియాలో(Gotiya) గ్రామంలో నేపాల్‌సింగ్(Nepal singh), అంజలి(Anjali) దంపతులు ఉంటున్నాన్నారు. ఈ క్రమంలో మరొక వ్యక్తితో అంజలికి వివాహేతర సంబంధం ఏర్పడింది. తన భార్య అంజలి మరొకరితో సన్నిహితంగా ఉండడం చూసిన నేపాల్‌సింగ్ ఆమెను సజీవ దహనం చేశాడు. అంజలి కనపడడం లేదని, తన భర్తే హత్య చేసి ఉంటాడని ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నేపాల్‌సింగ్‌ను అరెస్ట్ చేశారు. షాహి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పొలంలో కాలిపోయి ఉన్న అంజలి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేపాల్‌సింగ్‌ను పోలీసులు విచారించగా గడ్డివాము దగ్గర తన భార్య మరొకరితో అభ్యంతరకర స్థితిలో చూశానని, దీంతో ఆగ్రహంతోనే చంపినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు నేపాల్‌సింగ్.