లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా(Lok Sabha Protem speaker) సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్‌(Bhartruhari Mahtab) నియమితులయ్యారు..

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా(Lok Sabha Protem speaker) సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్‌(Bhartruhari Mahtab) నియమితులయ్యారు.. స్పీకర్‌ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్‌సభ ప్రిసైడింగ్‌ అధికారిగా ఆయన కార్య కలాపాలు నిర్వహిస్తారు. 18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయిస్తారు. ఆయనకు సహాయంగా ఉండే ఛైర్‌ పర్సన్‌ల ప్యానెల్ లో కె. సురేష్‌ (Congress)టీఆర్‌ బాలు (DMK), రాధా మోహన్‌ సింగ్‌, (BJP)ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే (బీజేపీ), సుదీప్‌ బంధోపాధ్యాయ,(TMC) ఉన్నారు. పార్లమెంటర వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఈ వివరాలు తెలిపారు. ఒడిశాలోని కటక్‌ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు విజయం సాధించారు భర్తృహరి మహతాబ్‌. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన బిజూ జనతాదళ్‌ను వదిలిపెట్టి బీజేపీలో చేరారు. కటక్ నియోజకవర్గం నుంచే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఏడోసారి గెలుపొందారు. ఇదిలా ఉంటే 18వ లోక్‌సభ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి మొదలవుతాయి. జూన్‌ 24, 25 తేదీల్లో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. జూన్‌ 26న స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు..

Eha Tv

Eha Tv

Next Story