ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు(AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ నాయకులు చిత్రవిచిత్రమైన హమీలను ఇచ్చేస్తున్నారు. మొత్తం భారతదేశంలో నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామనే వాగ్దానం ఏపీలో జోరుగా సాగుతోంది. ఏ నాయకుడైనా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పాలే కానీ, అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని(Alcohol) సరఫరా చేస్తామని చెప్పడమేమిటో! ఏపీలో నాయకులకంటే రెండాకులు ఎక్కువ చదివిన నేత ఒకరున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు(AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ నాయకులు చిత్రవిచిత్రమైన హమీలను ఇచ్చేస్తున్నారు. మొత్తం భారతదేశంలో నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామనే వాగ్దానం ఏపీలో జోరుగా సాగుతోంది. ఏ నాయకుడైనా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పాలే కానీ, అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని(Alcohol) సరఫరా చేస్తామని చెప్పడమేమిటో! ఏపీలో నాయకులకంటే రెండాకులు ఎక్కువ చదివిన నేత ఒకరున్నారు. ఆమె పేరు వనితా రౌత్(Vanita Raut). మహారాష్ట్రలోని(Maharastra) చంద్రాపూర్‌లో(chandapur) అఖిల భారతీయ మానవతా పార్టీ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. తాను లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధిస్తే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి చౌక ధరల దుకాణాల నుంచి రేషన్‌తో పాటు(Ration shop) విస్కీ, బీరును కూడా అందిస్తానని ఆమె ప్రకటించారు. నిరుద్యోగ యువకులకు మద్యం లైసెన్స్‌లు పంపిణీ చేస్తానని కూడా హామీ ఇచ్చారు.