భగిని(Sister) అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి(Diwali) వెళ్ళిన రెండవ రోజు ఈ వేడుకను జరుపుకుంటారు.
భాయ్ ధూజ్ ( Bhai Dhooj) పేరుతొ ఉత్తరదేశంలో(Uttar Pradesh) బాగా ప్రాచుర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది.

Bhai Dooj 2023
భగిని(Sister) అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం(Bhagini Hastha Bhojanam) అంటారు. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి(Diwali) వెళ్ళిన రెండవ రోజు ఈ వేడుకను జరుపుకుంటారు.
భాయ్ ధూజ్ ( Bhai Dhooj) పేరుతొ ఉత్తరదేశంలో(Uttar Pradesh) బాగా ప్రాచుర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది. మన పురాణాల్లో కధ ప్రకారం యమధర్మరాజు సోదరి యమున. ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నోసార్లు పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. చివరికి ఒకసారి ఈ కార్తీక శుద్ధ విదియ రోజున యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండివంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇరువురూ సంతోషించారు. ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా జన ప్రయోజనాలుగా వుంటాయి. ఆమె ఈ కార్తీకశుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే, తన సోదరి ఇంటికి వెళ్ళ భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి, అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం లేకుండా వుంటుంది, ఆ సోదరి సౌభాగ్యవతిగా వుంటుంది అని వరాలిచ్చాడట. అందువలనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది.
