వర్షకాలం ప్రారంభమైయింది. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. అయినప్పటికీ భానుడి ప్రతాపం మాత్రం తగ్గడం లేదు. జూన్-జూలై నెలలో సందర్శించడానికి భారతదేశంలో అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ వాతావరణం అద్భుతంగా ఉంటుంది. వేడి నుండి ఉపశమనం పొందడానికి, వాతావరణాన్ని ఆస్వాదించడానికి ప్రజలు వారాంతాల్లో ఇక్కడికి చేరుకుంటారు. ఈ ప్రదేశాలు ప్రజల మనసుకు ప్రశాంతతను కలిగించడమే కాకుండా ఆనందాన్ని ఇస్తాయి.
వర్షకాలం ప్రారంభమైయింది. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. అయినప్పటికీ భానుడి ప్రతాపం మాత్రం తగ్గడం లేదు. జూన్-జూలై నెలలో సందర్శించడానికి భారతదేశంలో అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ వాతావరణం అద్భుతంగా ఉంటుంది. వేడి నుండి ఉపశమనం పొందడానికి, వాతావరణాన్ని ఆస్వాదించడానికి ప్రజలు వారాంతాల్లో ఇక్కడికి చేరుకుంటారు. ఈ ప్రదేశాలు ప్రజల మనసుకు ప్రశాంతతను కలిగించడమే కాకుండా ఆనందాన్ని ఇస్తాయి. మన దేశంలో ఉన్న 5 ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
లాహౌల్-స్పితి, హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh): హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న లాహౌల్-స్పితి వేసవి కాలంలో పర్యాటకులకు ప్రధాన పర్యాటక కేంద్రంగా మారింది. ఇక్కడ జూన్-జూలైలో వాతావరణం అద్భుతంగా ఉంటుంది. దీనిని ప్లేటో అని కూడా పిలుస్తారు. ఇక్కడ మంచు పర్వత శిఖరాలు, సరస్సులు, ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ ఉన్న కిబ్బర్, ప్రపంచంలోని ఎత్తైన గ్రామం. 10వ శతాబ్దంలో నిర్మించిన త్రిలోకనాథ్ ఆలయం, యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వం, హిమాలయాల అజంతా అని పిలువబడే టాబో మొనాస్టరీ, ధంకర్ సరస్సు, గ్లూ మమ్మీ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.
మనాలి(Manali): మనాలి హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక ప్రధాన పర్యాటక ప్రదేశం. ఇక్కడ జూన్-జూలైలో వెళితే వేడి నుంచి ఉపశమనం పొంది చల్లని వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ పండ్ల తోటలు, మంచు పర్వతాలు, లోతైన లోయలతో పాటు ఆహారం, షాపింగ్‌లను అద్భుతంగా ఉంటాయి. పర్యాటకులు ఈ ప్రదేశాలను జీవితంలో మర్చిపోలేరు.
గోవా(Goa): జూన్-జూలైలో గోవా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. జూన్‌లో ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా 30, కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. అందుకే ఇక్కడ బీచ్‌ని పూర్తిగా ఆస్వాదించవచ్చు. జులైలో ఇక్కడ వర్షాకాలాన్ని
ఆస్వాదించవచ్చు. చుట్టుపక్కల ఉన్న అందమైన పచ్చని ప్రాంతాలు, పర్వతాలు, సముద్రం విహారయాత్రను పరిపూర్ణం చేస్తాయి.అంతేకాదు.. ఇక్కడ షాపింగ్, స్థానిక ఆహారాన్ని సరదాగా ఎంజాయ్ చేయవచ్చు.
మేఘాలయ(Meghalaya): ఇవే కాదు.. ఈశాన్య అందాలను చూడాల్సిందే. జూన్-జూలైలో మేఘాలయను సందర్శించాలని కూడా ప్లాన్ చేసుకోవడం అన్నింటికంటే బెటర్. భారతదేశంలోని ఈశాన్య హిమాలయ ప్రాంతంలో ఉన్న ఈ ప్రదేశం ప్రకృతికి, అడవులకు, పర్వతాలకు, నీటి జలపాతాలకు, ఇక్కడి ప్రజల జీవనానికి ప్రసిద్ధి చెందింది. వర్షంతో పాటు అందమైన ప్రకృతి దృశ్యాలు మరింత అందంగా కనిపిస్తాయి. ఇక్కడ చిరపుంజి జలపాతాలు, మేఘాలయ కొండలు, మేఘాలయ ప్రజల సాంస్కృతిక వారసత్వాన్ని ఆస్వాదించవచ్చు.
కూర్గ్(Kodagu): కర్ణాటకలోని కూర్గ్ నగరం జూన్-జూలై సీజన్‌లో సందర్శించడానికి మంచి ప్రదేశం. 'స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా' అని పిలువబడే ఈ ప్రదేశం చల్లని వాతావరణం, తేయాకు మసాలా తోటలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తడియాండమోల్ పీక్, కింగ్స్ సీట్, మడికేరి ఫోర్ట్, కావేరీ నిసర్గధామ, ఓంకారేశ్వర్ టెంపుల్, నాగర్‌హోల్ నేషనల్ పార్క్, నామ్‌డ్రోలింగ్ మొనాస్టరీ మొదలైనవాటిని సందర్శించవచ్చు. ఇక్కడ అద్భుతమైన జలపాతాలను చూడవచ్చు, ఏనుగుల శిబిరంలో సమయం గడపవచ్చు, బారాపోల్ నదిపై రాఫ్టింగ్ చేయవచ్చు, పుష్పగిరి వన్యప్రాణుల అభయారణ్యం సందర్శించవచ్చు అంతేకాకుండా కొడవ వంటకాలను ఆస్వాదించవచ్చు. ఈ సీజన్‌లో ఇక్కడ ఉష్ణోగ్రత దాదాపు 20 డిగ్రీల సెల్సియస్ నుండి 13 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంది.