ఓ ఫైన్‌ డే మీకు వాట్సప్‌ మెసేజో(Whats app), మెయిలో వస్తుంది. నాలుగు డజన్ల కోడిగుడ్లను(Eggs) మీకు కేవలం 49 రూపాయలకే అందిస్తున్నాం.. అట్టే ఆలోచించకండి.. ఈ ఆఫర్ కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది.. ఇదీ మెసేజ్‌ సారాంశం. పది రోజుల కిందట అచ్చంగా ఇలాంటి మెయిల్‌ సందేశమే బెంగళూరులోని(Bengaluru) వసంత్‌నగర్‌కు చెందిన ఓ మహిళకు వచ్చింది. ఆ సందేశం కూడా ఆకర్షణీయంగా ఉంది. ఆ మహిళ కూడా ఆ యాడ్‌ మెసేజ్‌కు పడిపోయింది.

ఓ ఫైన్‌ డే మీకు వాట్సప్‌ మెసేజో(Whats app), మెయిలో వస్తుంది. నాలుగు డజన్ల కోడిగుడ్లను(Eggs) మీకు కేవలం 49 రూపాయలకే అందిస్తున్నాం.. అట్టే ఆలోచించకండి.. ఈ ఆఫర్ కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది.. ఇదీ మెసేజ్‌ సారాంశం. పది రోజుల కిందట అచ్చంగా ఇలాంటి మెయిల్‌ సందేశమే బెంగళూరులోని(Bengaluru) వసంత్‌నగర్‌కు చెందిన ఓ మహిళకు వచ్చింది. ఆ సందేశం కూడా ఆకర్షణీయంగా ఉంది. ఆ మహిళ కూడా ఆ యాడ్‌ మెసేజ్‌కు పడిపోయింది. ఆలస్యం చేస్తే ఆఫర్‌ (Offer)మిస్‌ అవుతామేమోననుకుని వెంటనే మెయిల్‌ ఓపెన్‌ చేసింది. అదులో షాపింగ్‌ లింక్‌ను క్లిక్‌ చేసింది. ఆమె బ్యాంక్‌ వివరాలు(bank Details), ఫోన్‌ నెంబర్‌, ఇతర వివరాలు కావాలంటూ పక్కనే గూగుల్‌ ఫోరం తరహాలో ఓ ఫోల్డర్‌ కనిపించింది. మరేం ఆలోచించకుండా క్షణాల్లో ఆ మహిళ వివరాలను ఇచ్చేసింది. తర్వాత , క్రెడిట్‌ కార్డ్‌తో(Credit Card) మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉంది. వెంటనే తన క్రెడిట్‌ కార్డ్‌ సాయంతో 49 రూపాయలు చెల్లించింది. ఇక అప్పుడు మొదలయ్యింది సైబర్‌ కేటుగాళ్ల పని! ఆమె బ్యాంక్‌ అకౌంట్‌లో ఉన్న సుమారు 48 వేల రూపాయలను చటుక్కున మాయం చేశారు. అకౌంట్‌లో డబ్బులన్నీ ఆటోమాటిక్‌గా విత్‌డ్రా కావడంతో మోసపోయానని తెలుసుకుంది. వెంటనే పోలీసులకు(Police) ఫిర్యాదు చేసింది. తర్వాత బ్యాంకుకు ఫోన్‌ చేసి క్రెడిట్‌ కార్డును బ్యాక్‌ చేయించింది. పోలీసులు ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. అంచేత అతిగా ఎప్పుడూ ఆశపడకండి.

Updated On 26 Feb 2024 4:07 AM GMT
Ehatv

Ehatv

Next Story