బెంగళూరులో ఓ పారిశ్రామికవేత్తను హనీట్రాప్‌ చేసి ఆయనను రాచిరంపాన పెట్టిన స్టోరీ ఇది.

బెంగళూరులో ఓ పారిశ్రామికవేత్తను హనీట్రాప్‌ చేసి ఆయనను రాచిరంపాన పెట్టిన స్టోరీ ఇది. ఈ ముఠా వేధింపులు భరించలేక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కిలాడీ లేడి శ్రీదేవి(Sridevi) రుడగి (25), ఆమె ప్రియుడు సాగర్(Sagar), రౌడీషీటర్‌ గణేష్‌(Ganesh) కాలేలను నగర సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఆ పారిశ్రామిక వేత్త నుంచి ముద్దుకు రూ.50 వేల చొప్పున వసూలు చేయడం గమనార్హం. నిందితురాలు మహాలక్ష్మి లేఔట్‌లో ప్రీ స్కూల్‌ నిర్వహిస్తోంది. ఈ స్కూల్‌కు రాకేష్‌ వైష్ణవ్‌ (34) అనే పారిశ్రామికవేత్త తన పిల్లలను పంపించేవాడు. అలా శ్రీదేవితో రాకేష్‌కు పరిచయం అయింది. స్కూల్‌ నిర్వహణ నిమిత్తం అతని దగ్గర రూ.4 లక్షలను అప్పుగా తీసుకుంది. తన డబ్బును తిరిగి ఇవ్వాలని కోరగా ప్రీస్కూల్‌ పార్టనర్‌గా ఉండాలని కోరింది. దీంతో వీరి మధ్య చనువు పెరిగింది. శ్రీదేవితో మాట్లాడేందుకు కొత్త ఫొన్‌ దాంట్లోకి కొత్త ఫోన్‌ రాకేష్‌ కొనిచ్చాడు. అతనితో చనువుగా ఉంటూ మెల్లగా డబ్బు లాగడం ప్రారంభించింది. ముద్దుకు రూ.50 వేల చొప్పున వసూలు చేసింది. నీతోనే ఉంటా నాకు నువ్వే కావాలి అంటూ డబ్బు వసూలు చేసుకునేంది. ఇలాగే మరోసారి రూ.15 లక్షలు కావాలని కోరడంతో రాకేష్‌ (Rajesh)ఆగ్రహం వ్యక్తం చేసి సిమ్‌ కార్డు విరగొట్టాడు. తన పిల్లలకు టీసీ ఇస్తే వేరొక చోటకు వెళ్తామని రాకేష్ చెప్పాడు. టీసీ ఇస్తామని పిలవడంతో రాకేష్‌ స్కూల్‌కు చేరుకోగానే ఆమె ప్రియుడు సాగర్‌, రౌడీషీటర్ గణేష్‌ అక్కడే ఉన్నారు. శ్రీదేవితో సాగర్‌కు నిశ్చితార్థం అయిందని నువ్వు ఆమెతో ఎలా తిరుగుతున్నావని.. ఈ వీడియోలను నీ భార్యకు పంపిస్తామని బెదిరించారు. బలవంతంగా కారులో ఎక్కించుకొని దూర ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ రూ.కోటి ఇవ్వకపోతే వీడియోలను రాకేష్ భార్యకు పంపిస్తామని బెదిరించారు. చివరకు రూ.20 లక్షలు అయినా ఇవ్వాలని కోరారు. చివరికి రూ.1.9 లక్షలు తీసుకొని రాకేష్‌ను వదిలేశారు.

మార్చి 17న మరోసారి రాకేష్‌కు శ్రీదేవి ఫోన్‌ చేసి రూ.15 లక్షలు ఇస్తేనే మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు, చాటింగ్‌ను డిలిట్‌ చేస్తా, లేదంటే నీ భార్యకు చూపించి నీ సంసారాన్ని పాడు చేస్తానని బ్లాక్‌మెయిల్‌ చేసింది. దీంతో విసిగిపోయిన రాకేష్‌ చివరకు బెంగళూరు సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీదేవి, గణేష్‌, సాగర్‌లను అరెస్టు చేసి మరింత విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీదేవి బాధితులు చాలా మందే ఉన్నారని తేలింది. రాకేష్‌ తరహాలోనే మరికొందరు విద్యార్థుల తండ్రులను ఇలాగే బుట్టలో వేసుకొని రూ.50 వేలు ఇస్తే ముద్దు అంటూ షరతులు విధించి మోసం చేసేది. దర్యాప్తులో మరిన్ని హనీట్రాప్‌ బాగోతాలు బయటపడే అవకాశముందని తెలుస్తోంది. నగరంలో ఈ హనీట్రాప్‌ దందా సంచలనం కలిగిస్తోంది. ఈమె బారిన మరికొందరు పడి ఉంటారని అనుమానాలున్నాయి.

ehatv

ehatv

Next Story