పశ్చిమ బెంగాల్‌లోని నాడియాకు చెందిన ఎస్‌కే సాల్మాన్‌ అనే వ్యక్తి బెంగళూరు(Bengaluru)లో ఉంటున్నాడు. పొట్టపోసుకోవడం కోసం చెత్తను ఏరుకుంటున్నారు. ఎప్పటిలాగే రోడ్డు పక్కన చిత్తు కాగితాలేరుకోసాగాడు. అలా ఏరుకుంటున్నప్పుడు చెత్తకుప్పలో అతడికి ఓ బ్యాగ్‌ కనిపించింది. దానిపై యునైటెడ్‌ నేషన్స్‌ అనే స్టాంపు కూడా ఉంది.

పశ్చిమ బెంగాల్‌లోని నాడియాకు చెందిన ఎస్‌కే సాల్మాన్‌ అనే వ్యక్తి బెంగళూరు(Bengaluru)లో ఉంటున్నాడు. పొట్టపోసుకోవడం కోసం చెత్తను ఏరుకుంటున్నారు. ఎప్పటిలాగే రోడ్డు పక్కన చిత్తు కాగితాలేరుకోసాగాడు. అలా ఏరుకుంటున్నప్పుడు చెత్తకుప్పలో అతడికి ఓ బ్యాగ్‌ కనిపించింది. దానిపై యునైటెడ్‌ నేషన్స్‌(United Nations) అనే స్టాంపు కూడా ఉంది. ఆ బ్యాగును జాగ్రత్తగా అమృతహళ్లిలోని ఇంటికి తీసుకెళ్లాడు. తెరచి చూసి బిత్తరపోయాడు. కారణం ఆ బ్యాగ్‌ నిండా డాలర్ల కట్టలు ఉండటమే! మొత్తం 23 బండిళ్ల డాలర్లు ఉన్నాయందులో! వాటిని మన కరెన్సీలో మారిస్తే ఇంచుమించు పాతిక కోట్ల రూపాయలుంటుంది. అంత డబ్బును చూసేసరికి సల్మాన్‌కు ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. ఏం చేయాలో పాలుపోలేదు. విషయాన్ని గుజరీ వ్యాపారికి ఫోన్‌లో చెప్పాడు. తాను ప్రస్తుతం వేరే ఊరిలో ఉన్నానని, బెంగళూరుకు వచ్చేవరకు నీ దగ్గరే ఆ బ్యాగును భద్రంగా పెట్టుకోమని సూచించాడు. సల్మాన్‌లో భయం తగ్గలేదు. రెండు రోజుల పాటు కంటిమీద కునుకు లేకుండా గడిపాడు. చివరకు స్వరాజ్‌ ఇండియా సామాజిక కార్యకర్త ఆర్‌.కలీముల్లాను కలిసి విషయమంతా చెప్పుకొచ్చాడు. కలీముల్లా ఈ సంగతిని బెంగళూరు పోలీసు కమిషనర్‌ దయానంద్‌కు పూసగుచ్చినట్టు వివరించారు. పోలీసు కమిషనర్‌ చెప్పినట్టుగా సాల్మాన్‌ను, డబ్బును తీసుకుని కమిషనర్‌ ఆఫీసుకు వెళ్లారు కలీముల్లా. డబ్బు దొరికిన ప్రదేశంలో పోలీసులు తనిఖీలు చేశారు. అక్కడ ఇంకా నగదు ఏమైనా ఉందా? ప్రమాదకరమైన వస్తువులు ఏమైనా ఉన్నాయా? అని వెతికారు. వారికి అక్కడ ఏమీ దొరకలేదు. డాలర్ల కట్టలను రిజర్వ్‌ బాంకుకు పంపినట్టు పోలీసలు తెలిపారు. ఈ డబ్బు ఐక్యరాజ్యసమితి ఆర్ధిక నేరాల విభాగానికి చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాగులో ఓ లెటర్‌ కూడా ఉంది. బ్యాగులో విషపూరితమైన రసాయనాలున్నాయి కాబట్టి తెరిచేటప్పుడు జాగ్రత్త అని ఆ లేఖలో ఉంది. ఈ డాలర్ల కట్టలు నకిలీవి కాబోలని పోలీసులు భావిస్తున్నారు.

Updated On 8 Nov 2023 5:04 AM GMT
Ehatv

Ehatv

Next Story