బెంగళూరు రేవ్ పార్టీ కేసు(Bangalore Rave Party Case)కు సంబంధించి నటి హేమ(Actress Hema)కు బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం పది గంటలకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసు(Bangalore Rave Party Case)కు సంబంధించి నటి హేమ(Actress Hema)కు బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం పది గంటలకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. రేవ్‌పార్టీ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే తను ఆ పార్టీలో లేనని, తన ఫామ్ హౌజ్‌లో ఛిల్ అవుతున్నానని హేమ ఓ వీడియోను పెట్టింది. కొన్ని గంటలకే బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (సీసీబీ) హేమ ఫోటోను విడుదల చేశారు. అప్పుడు సైలెంట్‌గా ఉన్న హేమ మరుసటి రోజు తాను హైదరాబాద్(Hyderabad)లో ఉన్నానంటూ ఓ రెసిపీ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వెంటనే బ్లడ్ శాంపిల్ రిపోర్టును సీసీబీ బయటపెట్టింది. టెస్టుల్లో పాజిటివ్ అని వచ్చిందని, హేమ డ్రగ్స్ తీసుకున్నదని చెప్పారు. ఆ తర్వాత హేమ మీడియాతో మాట్లాడలేదు. కాకపోతే ఈ ప్రాబ్లమ్‌ను ఎలా సాల్వ్ చేసుకోవాలో తనకు తెలుసని చెప్పారు. దీనికి కౌంటర్‌గా ఇప్పుడు హేమకు నోటీసులు జారీ చేశారు బెంగళూరు పోలీసులు. రేవ్ పార్టీలో పట్టుబడిన 101 మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు పోలీసులు. వాటిని పరీక్షించగా 86 మంది మాదకద్రవ్యాలు సేవించినట్టు బయటపడింది. వాళ్లలో హేమ కూడా ఉన్నారు. దీంతో వెంటనే హేమకు నోటీసులు జారీ చేశారు. మిగిలిన వాళ్లకు కూడా విడతలవారీగా నోటీసులు ఇస్తున్నారు.