బెంగళూరు మెట్రో(Bengaluru Metro)లో ఓ యువ జంట రొమాన్స్ విషయం గురించి ఇటీవల సోషల్ మీడియాలో వైరలైంది.

బెంగళూరు మెట్రో(Bengaluru Metro)లో ఓ యువ జంట రొమాన్స్ విషయం గురించి ఇటీవల సోషల్ మీడియాలో వైరలైంది. నాడప్రభు కెంపేగౌడ మెట్రో స్టేషన్‌(Kempegowda Station)లో, ప్లాట్‌ఫాం 3 మీద ఓ యువకుడు, యువతి పబ్లిక్‌గా అనుచితంగా ప్రవర్తించారని, ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఆ జంట చాలా దగ్గరగా, అసభ్యకరంగా ఉన్నారని, ఇతర ప్రయాణికులు మహిళలు, వృద్ధులు కూడా ఉన్నా పట్టించుకోలేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాట్‌ఫారం మీద ఉన్న ఓ జంట రొమాన్స్‌ చేస్తూ కెమెరాకు చిక్కాడు. యువకుడు యువతి టీషర్ట్‌లోపలికి చేతి పెట్టి అనుచితంగా ప్రవర్తించాడు. అతను అలా చేస్తున్నా కానీ యువతి మాత్రం రెసిస్ట్ చేయకపోవడం విశేషం. ఈ వీడియో చూసిన వాళ్లు చాలా మంది "ఇది బెంగళూరు మెట్రోను ఢిల్లీ మెట్రోలా మారుస్తున్నారు" అని కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ఘటనపై "పబ్లిక్ ప్లేస్‌లో ఇలాంటి ప్రవర్తన సిగ్గుచేటు" అని ఆగ్రహించగా, కొందరు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (BMRCL)తో పాటు పోలీసులను ట్యాగ్ చేసి యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేశారు. BMRCL చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ BL యశవంత్ చవాన్ ఈ ప్రవర్తన అనుచితమని, వీడియో తీసిన వ్యక్తి ముందు జంటను హెచ్చరించి ఉండాల్సిందని లేదా సెక్యూరిటీ స్టాఫ్‌కు చెప్పి ఉండాలని అన్నారు. CCTV ఫుటేజ్ ఆ రోజుది దొరకడం కష్టంగా ఉందని, కానీ జంట ట్రావెల్ హిస్టరీ ట్రాక్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Watch Video Click HERE ...

Updated On 12 April 2025 10:38 AM GMT
ehatv

ehatv

Next Story