టమోటా సాగు, సైబర్ సెంటర్ వ్యాపారాలలో డబ్బు పోగొట్టుకున్న ఓ వ్యక్తి అప్పులపాలయ్యాడు.

టమోటా సాగు, సైబర్ సెంటర్ వ్యాపారాలలో డబ్బు పోగొట్టుకున్న ఓ వ్యక్తి అప్పులపాలయ్యాడు. బెంగళూరులోని(Bangalore) ఓ కంపెనీలో సిస్టం అడ్మినిస్ట్రేటర్‌గా ఉద్యోగం ఎక్కాడు. అప్పులు తీర్చేందుకు దొంగగా అవతారమెత్తాడు. ఆ సంస్థలోనే 50 ల్యాప్‌టాప్‌లు(Laptop) దొంగిలించి ఓ దుకాణంలో విక్రయించాడు. తమిళనాడులోని హోసూర్‌కు చెందిన 29 ఏళ్ల నిందితుడు ఎం.మురుగేష్‌. ఫిబ్రవరి 2024 నుంచి బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని టెక్నికలర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.

కోవిడ్ -19(covid-19) మహమ్మారి సమయంలో మురుగేష్ టమోటా సాగులో నష్టాలు రావడం, సైబర్ సెంటర్ కారణంగా రూ.25 లక్షల నష్టం రావడంతో దొంగగా మారాడు. రెండు నెలలుగా ల్యాప్‌టాప్‌లు దొంగిలించాడు. ఆగస్ట్ 22 నుంచి మురుగేష్ పనికి హాజరుకావడం మానేశాడు. మానిటర్డ్ రూమ్‌లో భద్రపరిచిన ల్యాప్‌టాప్‌లు మాయమైనట్లు తెలుసుకున్న కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదేశించింది. సీసీటీవీ ఫుటేజీలో మురుగేష్ ల్యాప్‌టాప్‌లను స్టోరేజీ నుంచి తీయడం వాటిని తన బ్యాగ్‌లో ఉంచడం కనిపించింది. దొంగిలించి ల్యాప్‌టాప్‌లను మురుగేష్ హోసూర్‌లోని రిపేర్ షాపులో విక్రయించాడు, అక్కడ అమ్మకాలు చేయడానికి కంపెనీ తనకు అధికారం ఉందని తప్పుడు ప్రచారం చేశాడు. వైట్‌ఫీల్డ్ పోలీసులు ఆగస్టు 30న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు, మురుగేష్‌ను హొసూరులో గుర్తించారు. సెప్టెంబర్ 2న వైట్‌ఫీల్డ్‌కు చెందిన నలుగురు అధికారులు హోసూర్‌కు వెళ్లి స్థానిక రాఘవేంద్ర థియేటర్‌లో మురుగేష్‌ను గుర్తించారు. మురుగేష్‌ను అరెస్టు చేసిన సమయంలో అతడి నుంచి ఐదు ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.హోసూరులోని దుకాణంలో 45 ల్యాప్‌టాప్‌లను విక్రయించినట్లు అంగీకరించాడు, తరువాత సెప్టెంబర్ 3న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించబడిన ల్యాప్‌టాప్‌ల మొత్తం విలువ రూ.22 లక్షలుగా అంచనా వేశారు. ఎనిమిది రోజుల పోలీసు కస్టడీ తర్వాత సెప్టెంబర్ 9న మురుగేష్ జైలుకు రిమాండ్ విధించారు.

Eha Tv

Eha Tv

Next Story