చికెన్ బిర్యానీ(Chicken Biryani) అన్నాక చికెన్ ముక్క లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి? అసలు చికెన్ ముక్క లేకుండా బిర్యాని తినడం అవమానం కాదా? బెంగళూరు(Bengaluru)లోని ఐటీఐ లేఅవుట్‌లో ఉంటున్న కృష్ణప్ప(Krishnappa)కు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. ఈ ఏడాది మే మాసంలో భార్యకు వంట్లో బాగోలేకపోవడం వల్ల వంట చేయలేదు.
చికెన్ బిర్యానీ(Chicken Biryani) అన్నాక చికెన్ ముక్క లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి? అసలు చికెన్ ముక్క లేకుండా బిర్యాని తినడం అవమానం కాదా? బెంగళూరు(Bengaluru)లోని ఐటీఐ లేఅవుట్‌లో ఉంటున్న కృష్ణప్ప(Krishnappa)కు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. ఈ ఏడాది మే మాసంలో భార్యకు వంట్లో బాగోలేకపోవడం వల్ల వంట చేయలేదు. దీంతో కృష్ణప్ప స్థానిక ప్రశాంత్ హోటల్(Prasanth Hotel)కు వెళ్లి చికెన్ బిర్యానీ తీసుకున్నాడు. ఇందుకోసం 150 రూపాయలు చెల్లించాడు. ఇంటికెళ్లి పొట్లం విప్పి చూస్తే బిర్యానీ తప్ప అందులో చికెన్ ముక్కలు కనిపించలేదు. మొత్తం వెతికాడు. చిన్నపాటి ముక్క కూడా కనిపించలేదు. పాపం తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. హోటల్‌కు వెళ్లి అడిగాడు.. పోదురూ.. మైసూర్ బజ్జీలో ఎక్కడైనా మైసూరు ఉంటుందా? ఇది కూడా అలాగే అంటూ హోటల్ వారు ఎకసెక్కలాడారు. కృష్ణప్పకు మనో వేదనతో పాటు కోపమూ వచ్చేసింది. వినియోగదారుల కోర్టులో కేసు వేశాడు. సాక్ష్యం కోసం బిర్యాని ఫోటోలు, బిల్లు కోర్టు వారికి సమర్పించాడు. తనకు 30 వేల రూపాయల నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా కోర్టును అభ్యర్థించాడు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు వెయ్యి రూపాయల పరిహారం, బిర్యానీ ధర 150 రూపాయలు తిరిగి ఇవ్వాలని హోటల్‌ను ఆదేశించింది. కొసమెరుపు ఏమిటంటే ఈ కేసులో కృష్ణప్ప తానే స్వయంగా వాదించుకుని విజయం సాధించడం!