బెంగళూరు(Bengaluru)లో తాగునీరు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు వాటర్(Water) సంక్షోభం తీవ్రంగా మారుతోంది. పాలకుల ముందుచూపు లేకపోవడం వల్లే బెంగళూరులో నీటికి కటకట ఏర్పడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కార్ వాషింగ్(Car Washing), నిర్మాణ పనులు(Construction Sector), వాటర్ ఫౌంటెయిన్లు(Water Fountains), గార్డెనింగ్ (Gardening), రోడ్ల నిర్మాణంపై బెంగళూరు నీటి సరఫరా బోర్డు ఆంక్షలు విధించింది.
బెంగళూరు(Bengaluru)లో తాగునీరు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు వాటర్(Water) సంక్షోభం తీవ్రంగా మారుతోంది. పాలకుల ముందుచూపు లేకపోవడం వల్లే బెంగళూరులో నీటికి కటకట ఏర్పడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కార్ వాషింగ్(Car Washing), నిర్మాణ పనులు(Construction Sector), వాటర్ ఫౌంటెయిన్లు(Water Fountains), గార్డెనింగ్ (Gardening), రోడ్ల నిర్మాణంపై బెంగళూరు నీటి సరఫరా బోర్డు ఆంక్షలు విధించింది. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే 5 వేల రూపాయల జరిమానా విధించనున్నట్లు తెలిపింది. మరోవైపు నగరంలో తాగునీటి సమస్యల కోసం నగరపాలిక సంస్థ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించిన కొద్ది సేపట్లోనే వేల కాల్స్ రావడంతో అధికారులు విస్తుపోతున్నారు. సీఎం సిద్ధరామయ్య క్యాంప్ ఆఫీస్‌కు కూడా వాటర్ ట్యాంకర్లతో నీటి సరఫరా చేయడం.. డిప్యూటీ సీఎం ఇంట్లో కూడా బోరులో నీరు అడుగంటి పోవడంతో నీటి కోసం ఎంత కటకట ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. ట్యాంకర్లు కూడా అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఒక్కో నీటి ట్యాంకర్‌పై రూ.2500 నుంచి రూ.3000 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. దీంతోపాటు బెంగళూరు పరిసర గ్రామాల్లో కూడా నీటి కొరత ఏర్పడింది.
అపార్ట్‌మెంట్స్ నుంచి కూడా నీటి కొరతపై ఫిర్యాదులు వస్తున్నాయి. వాటర్‌బోర్డు ద్వారా నీటి సరఫరా చేయాలని అపార్ట్మెంట్ వాసులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు నీటి ట్యాంకర్లకు ధరను నిర్ణయించారు. 5 కి.మీ పరిధిలో నీటిని సరఫరా చేసే 6 వేల లీటర్ల ట్యాంకర్‌కు రూ.600గా, 10 కి.మీ పరిధిలో అయితే రూ.750గా నిర్ణయించారు. 5 కి.మీ పరిధిలో 8 వేల లీటర్ల నీటి ట్యాంకర్‌కు రూ.700గా 10 కి.మీ. పరిధిలో 8 వేల లీటర్ల నీటికి రూ.850గా నిర్ణయించారు. 5 కి.మీ లోపు 12 వేల లీటర్ల నీటి ట్యాంకర్‌కు రూ.వెయ్యి, అదే 10 కి.మీ పరిధిలో నీటిని సరఫరా చేసే ట్యాంకర్‌కు రూ.1200గా నిర్ణయించారు.