గత కొన్ని నెలలుగా వర్షం లేక కర్ణాటక రాజధాని బెంగళూరు చాలా ఇబ్బందులను
గత కొన్ని నెలలుగా వర్షం లేక కర్ణాటక రాజధాని బెంగళూరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఎంతగా అంటే ఏకంగా 133 సంవత్సరాల రికార్డు బ్రేక్ అయ్యేంతగా!! జూన్ 2, ఆదివారం బెంగళూరులో రికార్డు వర్షం కురిసింది. జూన్‌లో ఒకే రోజులో అత్యధిక వర్షపాతంతో బెంగళూరు నగరంలో 133 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టిందని వాతావరణ అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, జూన్ 2న, కర్ణాటక రాజధానిలో 133 సంవత్సరాలలో అత్యధికంగా 111.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతంలో జూన్ 16, 1891న నగరంలో 101.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బెంగళూరు నగరంలోని జయనగర్, ఎలక్ట్రానిక్ సిటీ, ఎంజీ రోడ్, ఇందిరానగర్, ఫ్రేజర్ టౌన్ సహా పలు ప్రాంతాలు వర్షానికి అతలాకుతలమయ్యాయి.