ప్రియుడి మోజులో పడి ఓ మహిళ ఎంతటి దారుణానికి పాల్పడింది. ఇది దారుణం అనకూడదు అనుకుంటా. ప్రియుడి కోసం ఓ మహిళ బరితెగించిందనే చెప్పాలి.

ప్రియుడి మోజులో పడి ఓ మహిళ ఎంతటి దారుణానికి పాల్పడింది. ఇది దారుణం అనకూడదు అనుకుంటా. ప్రియుడి కోసం ఓ మహిళ బరితెగించిందనే చెప్పాలి. భర్తను నయవంచనకు గురిచేసిందంటే సమంజసంగా ఉంటుందేమో! కూతురు చదువు కోసం అని చెప్పి భర్త కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మేసిన మహిళ.. రాత్రికి రాత్రే ప్రియుడితో ఉడాయించింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా జిల్లాకు చెందిన మహిళ తమ కూతురు చదువు, వివాహానికి కావాల్సిన డబ్బు కోసం కిడ్నీ అమ్మాలని తన భర్తకు సూచించింది. దీంతో తమ కుటుంబానికి ఉన్న ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని భర్తను నమ్మించింది. కిడ్నీ అమ్మాల్సిందేనంటూ భార్య ఒత్తిడి చేయడంతో ఇక వేధింపులు భరించలేక భర్త తన కిడ్నీని రూ.10 లక్షలకు విక్రయించాడు. వచ్చిన డబ్బుతో తమ ఆర్థికస్థితి మెరుగుపడుతుందని భర్త కూడా ఆశించాడు. కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకోవాలని బాధ్యతగా ఆలోచించాడు. ఇందు కోసం తన ప్రాణ త్యాగానికైనా వెనుకాడలేదు. కానీ భార్య చేస్తున్న మోసాన్ని గమనించలేకపోయాడు ఆ అమాయకపు భర్త. భర్త ఆశలు గల్లంతయ్యాయి. ఆ వచ్చిన డబ్బుతో భార్య తన ప్రియుడుతో కలిసి పారిపోయింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రియుడు రవిదాస్‌తో లేచిపోయింది. కిడ్నీ అమ్మగా వచ్చిన రూ.10 లక్షల డబ్బు తీసుకుని ప్రియుడితో కలిసి పరారైంది. దాంతో దిగ్భ్రాంతికి గురైన ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ 'మాయకురాలు' తన ప్రియుడితో కలిసి

బారక్‌పూర్‌లో కులుకుతుందని సమాచారం తెలుసకున్న భర్త తన 10 ఏళ్ల కూతురు, కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని వెళ్లాడు. అక్కడికి వెళ్లిన భర్తకు, కూతురుకు మరోసారి షాక్‌ ఇచ్చింది కిలేడి. భర్త, కూతురు వచ్చినా వారి మొహంపై తలుపు వేసింది. విడాకులు ఇస్తాను ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ లోపలి నుంచి భర్తపై కేకలు వేసింది. అత్తమామలు కూడా వచ్చి బతిమాలినా ఆ మహిళ ఇంట్లోంచి బయటికే రాలేదు.పైగా, తన భార్య మాటలు నమ్మి తాను మోసపోయానని ఎలాగైనా తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని అమాయక భర్త వేడుకుంటున్నాడు.

ehatv

ehatv

Next Story