లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ పశ్చిమ బెంగాల్(West Bengal)లో బీజేపీ(BJP)కి కాసింత ఎదురుదెబ్బ తగిలే ఘటన ఒకటి వెలుగు చూసింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్( CV Ananda Bose)పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది.

West Bengal
లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ పశ్చిమ బెంగాల్(West Bengal)లో బీజేపీ(BJP)కి కాసింత ఎదురుదెబ్బ తగిలే ఘటన ఒకటి వెలుగు చూసింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్( CV Ananda Bose)పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఆనందబోస్‌పై ఓ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. రాజ్‌భవన్‌లో తాత్కాలిక ఉద్యోగి అయిన ఆమె గవర్నర్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఉద్యోగం ఆశచూపి గవర్నర్ తనపై పలుసార్లు లైంగికంగా వేధించారని తెలిపింది. అయితే ఆ ఉద్యోగిని ఆరోపణలను గవర్నర్ ఖండించారు. ఇది దురుద్దేశంతో అల్లిన కట్టుకథ అంటూ ట్విట్ చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ట్వీట్‌లో రాసుకొచ్చారు. 'ఎవరైనా నన్ను కించపరచడం ద్వారా ఎన్నికల ప్రయోజనాలను కోరుకుంటే.. వారికి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. బెంగాల్‌లో హింస, అవినీతికి వ్యతిరేకంగా నా పోరాటాన్ని ఎవరూ ఆపలేరు’ అంటూ వ్యాఖ్యానించారు. బెంగాల్ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సంబంధాలు అంతగా లేవన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ(pm modi) రెండు రోజుల పాటు బెంగాల్‌లో ప్రచారం చేయనున్నారు.
