బీజేపీ(BJP) నేత సువేందు(Suvendu) అధికారి వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ఖండించారు. టీఎంసీకి(TMC) జాతీయ పార్టీ హోదా కల్పించాలంటూ తాను కేంద్ర హోంమంత్రి

mamatha banerjee
బీజేపీ(BJP) నేత సువేందు(Suvendu) అధికారి వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ఖండించారు. టీఎంసీకి(TMC) జాతీయ పార్టీ హోదా కల్పించాలంటూ తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను(Amith Shah) కోరినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సీఎం మమతా బెనర్జీ బుధవారం ప్రకటించారు. గత వారం తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీ హోదాను ఎన్నికల సంఘం రద్దు చేసింది. మంగళవారం బీజేపీ నాయకుడు సువేందు అధికారి హుగ్లీ జిల్లాలోని సింగూర్‌లో ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ.. టీఎంపీ జాతీయ పార్టీ హోదాను రద్దు చేసిన తర్వాత మమతా బెనర్జీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారని పేర్కొన్నారు. కమిషన్ నిర్ణయాన్ని రద్దు చేయాలని మమతా బెనర్జీ.. అమిత్ షాను అభ్యర్థించారని సువేందు అధికారి పేర్కొన్నారు.
సువేందు అధికారి వ్యాఖ్యలతో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వేడి పెరిగింది. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ ఘాటుగా స్పందించింది. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మమతా బెనర్జీ బీజేపీని టార్గెట్ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 200 సీట్ల మార్కును దాటదని అన్నారు. అలాగే సువేందు అధికారి వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ.. తన పార్టీ పేరు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అని ఆయన స్పష్టం చేశారు.
