పంజాబ్(Punjab)లోని బఠిండా మిలటరీ స్టేషన్(Bathinda Military Station)పై దాడి జరిగిన ఘటన కొత్త మలుపు తిరిగింది. కాల్పుల్లో నలుగురు జవాన్లు చనిపోవడంతో ఇది ఉగ్రవాదుల పనేనని అనుకున్నారంతా! కానీ ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పంజాబ్ పోలీసులు(Punjab Police) మోహన్ దేశాయ్(Mohan Desai) అనే ఓ జవానును అరెస్ట్ చేశారు పోలీసులు. కాల్పుల తర్వాత అనుమానంతో అతడిని అరెస్ట్ చేసి విచారిస్తే నేరం ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.

Bathinda military station firing
పంజాబ్(Punjab)లోని బఠిండా మిలటరీ స్టేషన్(Bathinda Military Station)పై దాడి జరిగిన ఘటన కొత్త మలుపు తిరిగింది. కాల్పుల్లో నలుగురు జవాన్లు చనిపోవడంతో ఇది ఉగ్రవాదుల పనేనని అనుకున్నారంతా! కానీ ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పంజాబ్ పోలీసులు(Punjab Police) మోహన్ దేశాయ్(Mohan Desai) అనే ఓ జవానును అరెస్ట్ చేశారు పోలీసులు. కాల్పుల తర్వాత అనుమానంతో అతడిని అరెస్ట్ చేసి విచారిస్తే నేరం ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మొదట తమను తప్పుదోవ పట్టించాడని, తర్వాత నిజం అంగీకరించాడని చెప్పారు. చనిపోయిన జవాన్లతో మోహన్ దేశాయ్‌కి వ్యక్తిగత వైరం ఉందని బఠిండా సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీసు గుల్నీత్ సింగ్ ఖురానా అన్నారు. మృతి చెందిన నలుగురు జవాన్లు తనను వేధించడం దాడి చేసి చంపేశానని మోహన్ చెప్పాడట. తొలుత పోలీసులను అయోమయానికి గురి చేయడానికి కట్టుకథలు చెప్పాడని, విచారణలో అసలు విషయం చెప్పాడని పోలీసులు వివరించారు. ఈ ఘటనలో ఉపయోగించిన ఆయుధాలను మిలిటరీ స్టేషన్ నుంచే మోహన్ చోరీ చేశాడట. మోహన్‌కు ఇంకా పెళ్లి కాలేదని, ఒంటరిగానే ఉంటున్నాడని అధికారులు చెప్పారు. ఇతడిని కోర్టులోప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.
