తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి రెండు తెలుగురాష్ట్రాల దృష్టిని బర్రెలక్క (శిరీష) (Barrelakka) ఆకర్షించింది. సామాజిక మాధ్యమాల్లో రీల్స్‌తో ఫేమస్‌ అయిన బర్రెలక్క.. నిరుద్యోగ సమస్యను ముందుకేసుకొని కొల్లాపూర్‌ (Kollapur) అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా తగ్గేదేలేదు అన్నట్లు వ్యవహరిస్తుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి రెండు తెలుగురాష్ట్రాల దృష్టిని బర్రెలక్క (శిరీష) (Barrelakka) ఆకర్షించింది. సామాజిక మాధ్యమాల్లో రీల్స్‌తో ఫేమస్‌ అయిన బర్రెలక్క.. నిరుద్యోగ సమస్యను ముందుకేసుకొని కొల్లాపూర్‌ (Kollapur) అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా తగ్గేదేలేదు అన్నట్లు వ్యవహరిస్తుంది. నిరుద్యోగ సమస్యను దేశ వ్యాప్తంగా ఎత్తిచూపేందుకు ఈ సారి పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తానని మరో వీడియో విడుదల చేసింది. డబ్బు ఇచ్చేవారికి ఓటు వేయకుండా ప్రజా సమస్యలను పరిష్కరించేవారికి ఓటు వేయాలని ఆమె సూచించారు. నాగర్‌కర్నూల్‌ (Nagarkarnool) ఎంపీ స్థానం నుంచి పోటీలో ఉంటానని తెలిపింది. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని పంపించింది.

కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్కకు పలువురు నిరోద్యగ యువత అండగా నిలిచారు. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా బర్రెలక్క వార్తలే కనిపించేవి. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshmi Narayana) మద్దతు ఇచ్చారు. అంతేకాకుండా ఆయన స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు. యానాం మాజీ మంత్రి కృష్ణారావు (KrshnaRao) సహా పలువురు ఆమెకు విరాళాలు కూడా ఇచ్చారు. అయితే ఎన్నికల్లో అనూహ్యంగా ఆమెకు కేవలం 5,754 ఓట్లు మాత్రమే వచ్చాయి. కొల్లాపూర్‌ ఎన్నికల్లో ఓడిపోయినా తగ్గేది లేదని బర్రెలక్క ప్రకటించింది. పార్లమెంట్ బరిలో నిలిచి నిరుద్యోగ సమస్యను దేశానికి చాటి చెప్పుతానంటోంది.

Updated On 22 Jan 2024 11:20 PM GMT
Ehatv

Ehatv

Next Story