భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమి. దేశమంతటా ఆధ్మాత్మిక పరిమళాలు వెదజల్లుతుంటాయి. లక్షలాది దేవాలయలకు ఇది నిలయం. చాలా ఆలయాలు సుప్రసిద్ధం. రహస్యాలను ఇముడ్చుకున్న గుళ్లు అసంఖ్యాకం. కొన్నింటి దర్శనం కష్టతరం. మరికొన్ని ఆలయాల సందర్శన దుర్లభం. వాటి దగ్గరకు చేరుకోవాలంటే ఎంతో శ్రమించాలి. ప్రాణాలను పణంగా పెట్టాలి. అటువంటి ఓ ఆలయం ఉత్తరాఖండ్‌లోని(Uttarakhand) చమోలి జిల్లాలో ఉంది.
భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమి. దేశమంతటా ఆధ్మాత్మిక పరిమళాలు వెదజల్లుతుంటాయి. లక్షలాది దేవాలయలకు ఇది నిలయం. చాలా ఆలయాలు సుప్రసిద్ధం. రహస్యాలను ఇముడ్చుకున్న గుళ్లు అసంఖ్యాకం. కొన్నింటి దర్శనం కష్టతరం. మరికొన్ని ఆలయాల సందర్శన దుర్లభం. వాటి దగ్గరకు చేరుకోవాలంటే ఎంతో శ్రమించాలి. ప్రాణాలను పణంగా పెట్టాలి. అటువంటి ఓ ఆలయం ఉత్తరాఖండ్‌లోని(Uttarakhand) చమోలి జిల్లాలో ఉంది. బన్షీ నారాయణ ఆలయంగా(Bansi Narayana Temple) ప్రసిద్ధి పొందిన ఈ ఆలయంలో మహా విష్ణువు కొలువై ఉన్నాడు. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే ఏడాది పొడవునా మూసివేసి ఉండటం. కేవలం రక్షాబంధన్(Rakshabandhan) రోజునే అంటే రాఖీ పౌర్ణమి రోజునే ఆలయ తలుపులు తెరచుకుంటాయి. ఆ ఒక్క రోజే భక్తులకు స్వామి దర్శనమిస్తాడు. వామన(vamana) అవతారం నుంచి విముక్తి పొందిన తర్వాత మహా విష్ణువు మొదటిసారి ఇక్కడే ప్రత్యక్షమయ్యాడన్నది స్థానికుల విశ్వాసం. దుర్గమ లోయలో ఉన్న ఈ మందిరానికి వంశీ నారాయణ ఆలయం(vamsi Narayana Temple) అన్న పేరు కూడా ఉంది. ఈ దేవాలయానికి చేరుకోవడం చాలా కష్టం. సుమారు 12 కిలోమీటర్ల దూరం నడవాలి. ట్రెక్కింగ్ చేస్తూ కొందరు ఈ గుడికి చేరుకుంటారు. ఇక్కడ విష్ణువుతో పాటు శివుడు, వినాయకుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. రక్షాబంధన్ రోజున స్థానికులు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తమ అన్నదమ్ములకు రాఖీ కట్టే సమయానికి ముందు ఆడపడచులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. తమ సోదరులు శుఖ శాంతులతో ఉండాలని ప్రార్థనలు చేస్తారు. ఈ ఆలయానికి దగ్గరలోనే ఒక గుహ కూడా ఉంది. ఇక్కడ భక్తులు కానుకలను సమర్పించుకుంటారు. రాఖీ పౌర్ణమి రోజున స్థానికులు ప్రసాదంలో వెన్న కలిపి భగవంతుడికి నైవేద్యంగా సమర్పించుకుంటారు. రక్షాబంధన్ రోజు కోసం పర్యాటకులు ఎదురుచూస్తుంటారు. ఆ ఒక్క రోజు దర్శనం దొరుకుతుంది కాబట్టి భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంటుంది.