ఆగస్ట్ నెల ప్రారంభం కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుకు సంబంధించిన ముఖ్యమైన పనులను పూర్తి చేసుకునేందుకు వీలుగా.. మీ బ్యాంక్ సెలవుల జాబితాను ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. బ్యాంకులకు ఏఏ రోజులలో సెలవులు ఉంటాయో తెలిస్తే..
ఆగస్ట్(August) నెల ప్రారంభం కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుకు సంబంధించిన ముఖ్యమైన పనులను పూర్తి చేసుకునేందుకు వీలుగా.. మీ బ్యాంక్ సెలవుల(Bank Holidays) జాబితాను ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. బ్యాంకులకు ఏఏ రోజులలో సెలవులు ఉంటాయో తెలిస్తే.. మీకు ఎటువంటి సమస్య ఉండదు. ప్రభుత్వ(Govt), ప్రైవేట్(Privaite) బ్యాంకులకు సెలవులను ఆర్‌బీఐ నిర్ణయిస్తుంది. ప్రతి సంవత్సరం ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) సెలవుల క్యాలెండర్(Holidays Calender)ను విడుదల చేస్తుంది.
ఆర్బీఐ క్యాలెండర్(RBI Calender) ప్రకారం.. ఆగస్టు నెలలో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇందులో రెండవ, నాల్గవ శనివారం, ఆదివారం సెలవులు కూడా ఉన్నాయి. మిగిలిన రోజులు ప్రాంతీయ, జాతీయ స్థాయిలో బ్యాంకులకు సెలవులు. ఆదివారాలు(Sundays), రెండవ-నాల్గవ శనివారా(Saturdays)ల కారణంగా ఆగస్టు 6, 12, 13, 20, 26, 27 తేదీల్లో బ్యాంకులు మూతబడుతాయి. ఇవి కాకుండా దేశంలో ఈ నెలలో అనేక పండుగలు ఉండడంతో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఆగస్టు నెలలో స్వాతంత్ర్య దినోత్సవం(Indipendence Day), రక్షా బంధన్(Raksha Bandhan)తో సహా అనేక ఇతర సందర్భాలలో బ్యాంకులు మూతపడనున్నాయి.
ఆగస్టు 8న టెండాంగ్ ల్హో రమ్ ఫట్ కారణంగా సిక్కీంలో బ్యాంకులకు సెలవుదినం. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ఆగస్టు 16వ తేదీన పార్సీ నూతన సంవత్సరం సందర్భంగా బేలాపూర్, ముంబై, నాగ్‌పూర్ ప్రాంతాలలో బ్యాంకులకు సెలవు. ఆగస్టు 18వ తేదీ శ్రీమత్న శంకర్‌దేవ్ తిధి సందర్భంగా గౌహతిలో బ్యాంకులు మూతపడుతాయి. 28న ఓణం పండుగ సందర్భంగా కేరళలో సెలవు. రక్షా బంధన్ సందర్భంగా 30వ తేదీన రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లో సెలవుకాగా.. 31న రాఖీ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడుతున్నాయి.