ఈ నెలలో బ్యాంక్‌లకు(Bank) 10 రోజులకు పైనే సెలవులు వస్తున్నాయి. మార్చిలో దాదాపు 10 రోజులు బ్యాంకులు మూత పడనున్నాయి. జాతీయ, ప్రాంతీయ సెలవులతో పాటు రెండో, నాలుగో శనివారం, ఆదివారాలు కలిపి 1o రోజులు మూతపడనున్నాయి. మార్చి 8న శుక్రవారం నాడు మహా శివరాత్రి పర్వదినం ఉంది.

ఈ నెలలో బ్యాంక్‌లకు(Bank) 10 రోజులకు పైనే సెలవులు వస్తున్నాయి. మార్చిలో దాదాపు 10 రోజులు బ్యాంకులు మూత పడనున్నాయి. జాతీయ, ప్రాంతీయ సెలవులతో పాటు రెండో, నాలుగో శనివారం, ఆదివారాలు కలిపి 1o రోజులు మూతపడనున్నాయి. మార్చి 8న శుక్రవారం నాడు మహా శివరాత్రి పర్వదినం ఉంది. ఆ తర్వాత వచ్చే రెండో శనివారం, ఆదివారంతో కలిపి వరుసగా 3 రోజులు బ్యాంక్‌లు పని చేయవు. మార్చి 25న హోలీ ఉంది. దీనికి ముందు నాలుగో శనివారం, ఆదివారంతో కలిపి మళ్లీ 3 వరుస సెలవులు వచ్చాయి. అయితే బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చినా నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ సేవలతో వినియోగదారులపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు.

మార్చి 03-ఆదివారం
మార్చి 08-శుక్రవారం-మహా శివరాత్రి
మార్చి 09- రెండో శనివారం
మార్చి 10-ఆదివారం
మార్చి 17-ఆదివారం
మార్చి 23-నాలుగో శనివారం
మార్చి 24- ఆదివారం
మార్చి 25- సోమవారం-హోలీ
మార్చి 29 -శుక్రవారం- గుడ్ ఫ్రైడే
మార్చి 31- ఆదివారం

Updated On 1 March 2024 1:47 AM GMT
Ehatv

Ehatv

Next Story